Vijayawada floods : అండగా ఉంటా.. ఆందోళన వద్దు.. అర్ధరాత్రి వరకు వరద బాధితులతోనే సీఎం చంద్రబాబు
- Vijayawada floods : విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. సింగ్‌నగర్‌లో వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి వరకు వారి దగ్గరే ఉన్నారు. ఆహార పధార్థాలు పంపిణీ చేయించారు.
- Vijayawada floods : విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. సింగ్‌నగర్‌లో వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి వరకు వారి దగ్గరే ఉన్నారు. ఆహార పధార్థాలు పంపిణీ చేయించారు.
(1 / 9)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ సింగ్ నగర్‌లో పర్యటించారు. మధ్యాహ్నం వరద బాధితులను పరామర్శించిన అనంతరం.. అందించాల్సిన సహాయంపై సమీక్షించిన సీఎం.. ఆహారం, నీళ్ల బాటిళ్లను బాధితులకు ఇచ్చేందుకు అర్ధరాత్రి మళ్లీ వెళ్లారు.
(2 / 9)
ఆదివారం అర్ధరాత్రి సమయంలో విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సింగ్‍నగర్‌లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు.
(3 / 9)
ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ధైర్యం చెప్పారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.
(4 / 9)
దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుర్గగుడి అధికారులను పిలిపించి మాట్లాడారు. ఉదయంలోగా 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని ఆదేశించారు.
(5 / 9)
పలువురు బాధల్లో ఉన్నారని.. సింగ్‍నగర్‌లో పరిస్థితులపై పర్యవేక్షించానని చంద్రబాబు చెప్పారు. బాధితులు అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని.. నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
(6 / 9)
విజయవాడ ప్రైవేట్ హోటల్స్ యాజమానులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని సీఎం సూచించారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
(7 / 9)
వరద పరిస్థితులపై చంద్రబాబును ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు.
(8 / 9)
బాధితుల ఫిర్యాదులను సీఎం చంద్రబాబు స్వయంగా పెన్నుతో రాసుకున్నారు. వరదల వల్ల తలెత్తిన వివిధ సమస్యలను సీఎంకు బాధితులు వివరించారు. సహాయక చర్యలకు తలెత్తే సాంకేతిక ఇబ్బందులను బాధితులకు చంద్రబాబు వివరించారు.
ఇతర గ్యాలరీలు