Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్లు.. గంగూలీ, ధోని.. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్కేయండి!-champions trophy winning teams captains list ganguly dhoni sarfaraz ahmed stephen ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్లు.. గంగూలీ, ధోని.. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్లు.. గంగూలీ, ధోని.. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Published Feb 16, 2025 09:08 PM IST Chandu Shanigarapu
Published Feb 16, 2025 09:08 PM IST

  • Champions Trophy: ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్ గా జట్టును గెలిపించడమంటే సాధారణ విషయం కాదు. ఇప్పటివరకూ 8 ఛాంపియన్స్ ట్రోఫీలు జరిగాయి. ఈ టోర్నీల్లో ఆయా జట్లను గెలిపించిన కెప్టెన్లు ఎవరో తెలుసుకోవాలంటే ఈ లిస్ట్ చూసేయండి. 

1998 లో మొట్టమొదటిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (అప్పుడు ఇంటర్నేషనల్ కప్)ని దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. కెప్టెన్ హాన్సీ క్రోంజే సఫారీ జట్టును టైటిల్ దిశగా నడిపించాడు. ఫైనల్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. 

(1 / 7)

(x/Basith)

స్టీఫెన్ ఫ్లెమింగ్ కెప్టెన్సీ లోని న్యూజిలాండ్ జట్టు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ని ఖాతాలో వేసుకుంది. భారత్ పై గెలిచే కివీస్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఓడింది. 

(2 / 7)

(Sportskeeda.com)

2002 లో ఇద్దరు కెప్టెన్లు కలిసి ఉమ్మడిగా ట్రోఫీని కైవసం చేసుకున్నారు. భారత్, శ్రీలంక తలపడ్డ ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత కెప్టెన్ గంగూలీ, శ్రీలంక సారథి జయసూర్య కలిసి ట్రోఫీ అందుకున్నారు. భారత్ గెలిచిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీ ఇదే. 

(3 / 7)

(x/icc)

2004 లో కెప్టెన్ గా బ్రయాన్ లారా వెస్టిండీస్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఆ ఫైనల్లో కరీబియన్ జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది.  ఆ విజయంతో విండీస్ సంబరాల్లో మునిగిపోయింది. 

(4 / 7)

ఛాంపియన్స్ ట్రోఫీని రెండు సార్లు జట్టుకు అందించిన ఏకైక కెప్టెన్ గా రికీ పాంటింగ్ చరిత్ర నమోదు చేశాడు. అతని కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా 2006, 2009 లో ఛాంపియన్ గా నిలిచింది. 2006 ఫైనల్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై గెలిచిన ఆసీస్.. 2009 తుదిపోరులో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. 

(5 / 7)

(x/Crictracker)

మహేంద్ర సింగ్ ధోని భారత్ కు రెండో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అతని సారథ్యంలో జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను 5 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. 

(6 / 7)

(x/mufaddal vohra)

చివరగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ కు టైటిల్ అందించాడు. ప్రపంచ క్రికెట్లో ఉత్కంఠ రేపిన ఆ టోర్నీ ఫైనల్లో 180 పరుగుల తేడాతో భారత్ ను పాక్ ఓడించింది. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై పాక్ కు అదే తొలి విజయం. 

(7 / 7)

(x/abubakartarar)

Chandu Shanigarapu

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు