Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఎన్ని సార్లు గెలిచింది? విన్నర్స్ లిస్ట్ ఇదే
- Champions Trophy: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఎన్నిసార్లు గెలిచింది? ఈ టోర్నీలో ఏయే జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి? ట్రోఫీని ముద్దాడిన జట్లేవో చూసేద్దాం.
- Champions Trophy: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఎన్నిసార్లు గెలిచింది? ఈ టోర్నీలో ఏయే జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి? ట్రోఫీని ముద్దాడిన జట్లేవో చూసేద్దాం.
(1 / 7)
2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ లో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్లో ఆతిథ్య జట్టునే చిత్తుచేసింది. వర్షం కారణంగా 20 ఓవర్ల చొప్పున నిర్వహించిన ఈ వన్డేలో మొదట ఇండియా 129/7 స్కోరు సాధించింది. కోహ్లి (43), జడేజా (33 నాటౌట్), ధావన్ (31) బ్యాటింగ్ లో మెరిశారు. ఛేజింగ్ లో ఇంగ్లండ్ 124/8 కు పరిమితమైంది. జడేజా, అశ్విన్, ఇషాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత ఆనందంలో కోహ్లి వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి.
(x/sunrisers hyderabad)(2 / 7)
నిజానికి 2002లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే అప్పుడు శ్రీలంకతో కలిసి జాయింట్ విన్నర్ గా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్ కు వర్షం అడ్డుగా నిలిచింది. తొలి రోజు లంక 50 ఓవర్లు ఆడింది. భారత్ రెండు ఓవర్లు ఆడిన తర్వాత వర్షంతో ఆట సాధ్యం కాలేదు. తర్వాతి రోజు లంక మళ్లీ 50 ఓవర్లు ఆడింది. భారత్ ఛేదనలో 9 ఓవర్లో వచ్చిన వర్షం ఆటను సాగనివ్వలేదు. దీంతో సనత్ జయసూర్య, గంగూలీ కలిసి ట్రోఫీ అందుకున్నారు.
(x/icc)(3 / 7)
ఐసీసీ టోర్నీల్లో బ్యాడ్ లక్ వెంటాడే దక్షిణాఫ్రికా ఇప్పటివరకూ ఒకే ఒక్క టోర్నీ గెలవగలిగింది. అదే మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ. 1998 బంగ్లాదేశ్ లో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో మొదట వెస్టిండీస్ 245 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో 6 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా టార్గెట్ రీచ్ అయింది. కలిస్ 5 వికెట్లు తీయడంతో పాటు 37 పరుగులతో జట్టు ను గెలిపించాడు.
(x/icc)(4 / 7)
2000 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత న్యూజిలాండ్. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో ఈ బ్లాక్ క్యాప్స్ గెలిచిన ఏకైక ఐసీసీ టోర్నీ ఇదే. కెన్యాలో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్ పైనే కివీస్ నెగ్గింది. మొదట గంగూలీ సెంచరీతో టీమ్ఇండియా 264/6 స్కోరు చేసింది. ఛేదనలో క్రిస్ కైర్స్న్ అజేయ శతకంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగా న్యూజిలాండ్ గెలిచింది.
(x/Abhishek AB)(5 / 7)
హోరాహోరీగా సాగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్ ను దాటి వెస్టిండీస్ విజేతగా నిలిచింది. స్వదేశంలోని ఓవల్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 217 పరుగులకు ఆలౌటైంది. ట్రెస్కోతిక్ సెంచరీతో పోరాడాడు. ఛేదనలో 8 వికెట్లు కోల్పోయిన విండీస్ 48.5 ఓవర్లలో గెలిచింది. చందర్ పాల్ టాప్ స్కోరర్.
(x/icc)(6 / 7)
అప్పట్లో ప్రపంచ క్రికెట్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా వరుసగా 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2006 టోర్నీ ఫైనల్లో వెస్టిండీస్ పై ఆసీస్ గెలిచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 టోర్నీ లో న్యూజిలాండ్ ను ఓడించి కంగారూ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది.
(x/icc)ఇతర గ్యాలరీలు