(1 / 8)
Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరింది. గ్రూప్ ఎలో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన మన్ టీమ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ 0.647గా ఉంది.
(ICC-X)(2 / 8)
Champions Trophy Points Table: బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ తనతోపాటు టీమిండియాను కూడా సెమీఫైనల్లోకి తీసుకెళ్లింది. ఆ టీమ్ కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. 0.863 నెట్ రన్ రేట్ తో గ్రూప్ ఎలో తొలి స్థానంలో ఉంది.
(AFP)(3 / 8)
Champions Trophy Points Table: టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన ఆతిథ్య దేశం పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వెళ్లిపోయింది. ఆ టీమ్ గ్రూప్ ఎలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్ లలోనూ ఓడిన పాక్ -1.087తో అట్టుడుగున ఉంది.
(HT_PRINT)(4 / 8)
Champions Trophy Points Table: న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన బంగ్లాదేశ్ కూడా ఇంటికెళ్లిపోయింది. అంతకుముందు ఇండియా చేతుల్లోనూ ఓడిన విషయం తెలిసిందే. బంగ్లా టీమ్ ప్రస్తుతం గ్రూప్ ఎలో మూడో స్థానంలో ఉంది.
(REUTERS)(5 / 8)
Champions Trophy Points Table: అటు గ్రూప్ బిలో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. ఆ టీమ్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. ఆ టీమ్ రెండు పాయింట్లు, 2.140 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది.
(AFP)(6 / 8)
Champions Trophy Points Table: తొలి మ్యాచ్ లో భారీ టార్గెట్ చేజ్ చేసి ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఖాతాలో రెండు పాయింట్లతోపాటు 0.475 నెట్ రన్ రేట్ తో ఉంది.
(AP)(7 / 8)
Champions Trophy Points Table: ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ -0.475గా ఉంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు