Champions Trophy: బుమ్రా నుంచి కమిన్స్ వరకు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఐదుగురు స్టార్లు దూరమవుతారా?
- Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ నుంచి బుమ్రా, కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ దూరం కానున్నారా? ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్న వీళ్లలాంటి స్టార్లు ఎవరో చూద్దాం.
- Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ నుంచి బుమ్రా, కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ దూరం కానున్నారా? ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్న వీళ్లలాంటి స్టార్లు ఎవరో చూద్దాం.
(1 / 6)
ఈ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది.అయితే ఈ మెగా ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఐసిసి తీవ్రంగా సన్నద్ధమవుతోంది.అయితే ఈలోగా కొందరు బడా ఆటగాళ్లు గాయపడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగిన లేదా నిష్క్రమించే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
(2 / 6)
Champions Trophy: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు దూరమైన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అనుమానమే.
(3 / 6)
Champions Trophy: ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ గాయం కారణంగా దూరమయ్యాడు.
(4 / 6)
Champions Trophy: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి అనుమానమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే కమిన్స్ కాలికి గాయమైంది. దీంతో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడటం లేదు. కమిన్స్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అనుమానమే అని కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ చెప్పాడు.
(5 / 6)
Champions Trophy: ఆస్ట్రేలియాకు చెందిన మరో పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నా.. అతని ఫిట్‌నెస్ ను బట్టే తీసుకుంటామని టీమ్ స్పష్టం చేసింది. అతడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే గాయపడ్డాడు.
ఇతర గ్యాలరీలు