CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్‌లు ఇవే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్ లు ఏవో ఒకసారి చూద్దాం. ఇందులో దాయాదులు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే హైఓల్టేజ్ మ్యాచ్ కూడా ఉంది.
- CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్ లు ఏవో ఒకసారి చూద్దాం. ఇందులో దాయాదులు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే హైఓల్టేజ్ మ్యాచ్ కూడా ఉంది.
(1 / 6)
CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కాబోతోంది. 8 జట్లు 20 రోజుల పాటు ఈ మినీ వరల్డ్ కప్ కోసం తలపడబోతున్నాయి. మరి వీటిలో కచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్ లేవో చూడండి.
(AFP)(2 / 6)
CT 2025 Must Watch Matches: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంటుంది. ఈ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దుబాయ్ లో జరగనుంది. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన పాకిస్థాన్ ఓవైపు.. ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోవైపు ఉన్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి ఇప్పుడు పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి.
(AFP)(3 / 6)
CT 2025 Must Watch Matches: గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ ఏడాది యాషెస్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే ఇటు ఇండియా చేతుల్లో ఇంగ్లండ్, అటు శ్రీలంక చేతుల్లో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లు ఓడి వస్తున్న నేపథ్యంలో వీళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.
(AFP)(4 / 6)
CT 2025 Must Watch Matches: ఇండియా, న్యూజిలాండ్ మధ్య మార్చి 2వ తేదీని మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో ఆ టీమ్ చేతుల్లో టెస్టు సిరీస్ లో దారుణమైన వైట్ వాష్ కు గురైన ఇండియన్ టీమ్.. ప్రతీకారం కోసం చూస్తోంది. అయితే రెండు టీమ్స్ టాప్ ఫామ్ లో ఉండటంతో హోరాహోరీ తప్పేలా లేదు.
(ANI Pictures Wire)(5 / 6)
CT 2025 Must Watch Matches: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై గెలిచినంత పని చేసిన మ్యాక్స్‌వెల్ అద్భుతమైన సెంచరీతో ఓడిపోయింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. ఇప్పుడు గ్రూప్ బిలో ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఆ ఓటమికి ప్రతీకారం కోసం ఆప్ఘన్ టీమ్ చూస్తోంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 28న జరగనుంది.
(AFP)ఇతర గ్యాలరీలు