Teamindia: స్పిన్ ఎటాక్ లో తగ్గేదేలే.. భారత జట్టులోఅయిదుగురు స్పిన్నర్లు.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా
Teamindia: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ హెవీ స్పిన్ ఎటాక్ తో సిద్ధమైంది. 15 మంది ఆటగాళ్ల లిస్ట్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 మంది స్పిన్నర్లకు చోటునిచ్చింది. ఆ స్పిన్నర్లెవరో చూసేయండి.
(1 / 5)
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పై స్పిన్ దళాన్ని నడిపించే బాధ్యత ఉంది. సీనియర్ స్పిన్నర్ గా అతను జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ సత్తాచాటే జడేజా 199 వన్డేల్లో 2779 పరుగులు, 226 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
(HT_PRINT)(2 / 5)
స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టీమ్ఇండియాకు కీలక ఆటగాడిగా మారాాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జట్టుకు రెండు రకాలుగా ఉపయోగపడతాడు. ఇంగ్లండ్ తో మూడో వన్డే ముందు వరకు 31 ఏళ్ల అక్షర్ 62 వన్డేల్లో 661 పరుగులు చేశాడు. 65 వికెట్లు పడగొట్టాడు.
(AFP)(3 / 5)
మణికట్టు స్పిన్నర్ గా జట్టులోకి దూసుకొచ్చిన 30 ఏళ్ల కుల్ దీప్ కెరీర్ కు మధ్యలో ఫామ్ లేమి, గాయాలు బ్రేక్ వేశాయి. కానీ ఫైటింగ్ స్పిరిట్ తో సాగుతున్న అతను ఇంజూరీస్ ను వెనక్కి నెట్టి రాణిస్తున్నాడు. రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను బోల్తా కొట్టించే కుల్ దీప్ 107 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు.
(PTI)(4 / 5)
33 ఏళ్ల వయసులో వన్డేల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికవడం ఊహించనిదే. కొంతకాలంగా టీ20ల్లో లెగ్ స్పిన్ తో అదరగొడుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్ చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. 18 టీ20ల్లో 33 వికెట్లు పడగొట్టిన వరుణ్ ఇప్పటివరకూ ఒకే వన్డే ఆడాడు.
(AP)ఇతర గ్యాలరీలు