
(1 / 5)
తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యంత కీలకమైన సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

(2 / 5)
ఈ మార్గం ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

(3 / 5)
రైల్వే లైన్ల విస్తరణతో కాజీపేట-సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

(4 / 5)
ఈ సరికొత్త ప్రాజెక్టుతో సికింద్రాబాద్-కాజీపేట మధ్య ప్రయాణ సమయం గంట వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నరెండు రైల్వే లైన్ల మధ్య ప్రయాణ సమయం రెండున్నర నుంచి 3 గంటలు పడుతోంది. అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటైతే రైలు వేగం గంటకు 130 నుంచి 150 కి.మీటర్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది.

(5 / 5)
ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని రైల్వే శాఖ రూపొందించిన డీపీఆర్‌లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా.
ఇతర గ్యాలరీలు