(1 / 8)
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
(2 / 8)
రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.
(3 / 8)
రేషన్ కార్డుల లేకపోవటంతో చాలా మంది ఈ స్కీమ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు లేదా పుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఆదాయపత్రం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రేషన్ కార్డు, పుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు మీ-సేవా ద్వారా జారీ చేయహడిన ఆదాయ ధ్రువీకరణపత్రం నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
(4 / 8)
2016 తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేయబడిన కుల ధ్రువీకరణపత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చని సర్కార్ తెలిపింది. మరలా కొత్త పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.

(5 / 8)
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరారు.

(6 / 8)
ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఆ తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు.
(7 / 8)
ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.
(8 / 8)
ఈ స్కీంలో భాగంగా అర్హులైన యువతకు రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 50 వేల లోపు యూనిట్లకు వంద శాతం రాయితీ అందుతుంది. ఈ యూనిట్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ (https://tgobmmsnew.cgg.gov.in/ ) లో పొందుపరిచారు.
ఇతర గ్యాలరీలు