తెలుగు న్యూస్ / ఫోటో /
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన రిచెస్ట్ అథ్లెట్లు వీళ్లే- ఈ గోల్ఫ్ ప్లేయర్ ఏడాది సంపాదన 1750 కోట్లు
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం మొదలుకానున్నాయి. రాత్రి 11 గంటల నుంచి విశ్వ క్రీడల ఆరంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో వరల్డ్ లోని కొందరు రిచెస్ట్ అథ్లెట్లు మెడల్స్ కోసం పోటీపడబోతున్నారు. వారు ఎవరంటే?
(1 / 5)
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటోన్న రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహ్మ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గోల్ఫ్ ప్లేయర్ ఏడాది సంపాదన 1750 కోట్లకుపైనే కావడం గమనార్హం.
(2 / 5)
యూఎస్ఏ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ ఏడాదికి 1060 కోట్లకుపైనే సంపాదిస్తుంటాడు. ఈ ఒలింపిక్స్ రిచెస్ట్ అథ్లెట్లలో అతడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. స్టీఫెన్ కర్రీ 852 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
(3 / 5)
ఇటీవలే వింబల్డన్ విజేతగా నిలిచిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కారజ్ ఏడాదిలో 376 కోట్లకుపైనే గడిస్తుంటాడు. ఒలింపిక్స్ బరిలో నిలిచిన రిచెస్ట్ ప్లేయర్ల లిస్క్‌లో అల్కారజ్ ఐదో స్థానంలో ఉన్నాడు. వింబుల్డన్ రన్నరప్ జకోవిచ్ 326 కోట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.
ఇతర గ్యాలరీలు