తెలుగు న్యూస్ / ఫోటో /
Chapatis For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ చపాతీలు తినొచ్చా? రోజుకు ఎన్ని తినాలి?
డయాబెటిస్ ఉన్న వారిలో చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటుందని భావిస్తారు. ఇలా ప్రతిరోజూ చపాతీలు తినడం డయాబెటిస్ పేషెంట్లకు మంచిదేనా.. వీళ్లు రోజుకు ఎన్ని చపాతీలు తినొచ్చు?
(1 / 8)
భారతదేశంలో చాలా మంది ఒక పూట ఆహారంగా చపాతీలనే తింటుంటారు. గోధుమలతో చేసిన చపాతీ అనేక పోషకాలకు మూలం. గోధుమల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(2 / 8)
ముఖ్యంగా గోధుమల్లో ఉండే ఫైబర్ గ్లూకోజ్ శోషణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ వీటిని తినొచ్చా..? రోజుకు ఎన్ని చపాతీలు తినాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.(freepik)
(3 / 8)
డయాబెటిస్ ఉన్నవారు చపాతీలు తినవచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.డయాబెటిస్ ఉంటే గోధుమ చపాతీలను లిమిటెడ్‌గానే తినాలని స్టడీలు చెబుతున్నాయి.ప్రాసెస్ చేసిన పిండి చపాతీల కంటే మర పట్టించిన గోధుమలతో చేసిన చపాతీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
(4 / 8)
డయాబెటిస్ ఉంటే చపాతీలను పరిమిత పరిమాణంలో తినాలని డైటీషియన్ చెబుతున్నారు. రోజుకు ఎన్ని చపాతీలు తినాలి అనేది చపాతీ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మీడియం సైజ్ చపాతీలు అయితే రోజుకు 2 నుంచి 3 మాత్రమే తినవచ్చు.డయాబెటిక్ పేషెంట్లు అల్పాహారం లేదా లంచ్‌కు మాత్రమే చపాతీని వాడాలి.
(5 / 8)
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు రోజుకు ఎన్ని చపాతీలు తినాలనేది మీ వయస్సు, లింగం, శారీరక శ్రమ, ఇతర ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
(6 / 8)
చపాతీలలో ఉండే కార్బొహైడ్రేట్స్ తగ్గించాలి. అందుకోసం మీ ప్లేట్లో చపాతీలతో పాటు అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న కూరగాయలు, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని జోడించండి.
(7 / 8)
గోధుమలతో పాటు, ఫైబర్ కంటెంట్ పెంచడానికి బార్లీ, రాగి గింజల పిండిని కలపాలి. చపాతీలు చేసే సమయంలో గోధుమ పిండితో పాటు రాగులు వంటి కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే పిండిని చేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలను పెరగకుండా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు