California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం-california storm hundreds of thousands without power as dangerous storm batters california ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం

California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం

Feb 06, 2024, 12:17 PM IST HT Telugu Desk
Feb 06, 2024, 12:17 PM , IST

  • California Storm: లాస్ఏంజిల్స్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో పది లక్షల మంది కాలిఫోర్నియా వాసులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

కాలిఫోర్నియాను భారీ వర్షాలు ముంచెత్తాయి, వరదలతో పెను ప్రమాదాన్ని పెంచాయి. శక్తివంతమైన పసిఫిక్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో లక్షలాది మంది ప్రజలు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.

(1 / 9)

కాలిఫోర్నియాను భారీ వర్షాలు ముంచెత్తాయి, వరదలతో పెను ప్రమాదాన్ని పెంచాయి. శక్తివంతమైన పసిఫిక్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో లక్షలాది మంది ప్రజలు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.(Getty Images via AFP)

లాస్ ఏంజిల్స్ ప్రాంతంతో సహా దక్షిణ కాలిఫోర్నియా మొత్తం ఆకస్మిక వరద హెచ్చరికలు, పర్యవేక్షణలో ఉంది. 

(2 / 9)

లాస్ ఏంజిల్స్ ప్రాంతంతో సహా దక్షిణ కాలిఫోర్నియా మొత్తం ఆకస్మిక వరద హెచ్చరికలు, పర్యవేక్షణలో ఉంది. (Getty Images via AFP)

12.7 నుండి 25.4 సెంటీమీటర్లు మధ్య వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ నివేదించింది.

(3 / 9)

12.7 నుండి 25.4 సెంటీమీటర్లు మధ్య వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ నివేదించింది.(AFP)

లాస్ ఏంజెల్స్‌లో తుఫాను సమయంలో కొండచరియలు విరిగిపడిన బురద, రాళ్లపై సహాయక సిబ్బంది 

(4 / 9)

లాస్ ఏంజెల్స్‌లో తుఫాను సమయంలో కొండచరియలు విరిగిపడిన బురద, రాళ్లపై సహాయక సిబ్బంది (Bloomberg)

లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ హిల్స్ లో ఫిబ్రవరి 5న సంభవించిన రెండు తుపాన్లు శక్తివంతమైనవి కావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు ఇళ్లపై విరిగిపడ్డాయి.

(5 / 9)

లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ హిల్స్ లో ఫిబ్రవరి 5న సంభవించిన రెండు తుపాన్లు శక్తివంతమైనవి కావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు ఇళ్లపై విరిగిపడ్డాయి.(AFP)

లాస్ ఏంజిల్స్ నది తుఫాను ప్రవాహంతో ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉంది, వారం కంటే తక్కువ వ్యవధిలో రెండవ తుపాన్ సంభవించడంతో వరదలు ఫిబ్రవరి 5 న దక్షిణ కాలిఫోర్నియాను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

(6 / 9)

లాస్ ఏంజిల్స్ నది తుఫాను ప్రవాహంతో ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉంది, వారం కంటే తక్కువ వ్యవధిలో రెండవ తుపాన్ సంభవించడంతో వరదలు ఫిబ్రవరి 5 న దక్షిణ కాలిఫోర్నియాను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.(Getty Images via AFP)

లాస్ ఏంజిల్స్ లోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజెల్స్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని నిరాశ్రయులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది డాలర్ల విలువైన ఇళ్లల్లో బురద, బండరాళ్లు పడిపోయాయని, కాలిఫోర్నియాలో పది లక్షల మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని యంత్రాంగం నివేదించింది.

(7 / 9)

లాస్ ఏంజిల్స్ లోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజెల్స్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని నిరాశ్రయులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది డాలర్ల విలువైన ఇళ్లల్లో బురద, బండరాళ్లు పడిపోయాయని, కాలిఫోర్నియాలో పది లక్షల మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని యంత్రాంగం నివేదించింది.(AP)

తొలుత ఉత్తర కాలిఫోర్నియాను తాకిన తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

(8 / 9)

తొలుత ఉత్తర కాలిఫోర్నియాను తాకిన తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. (Getty Images via AFP)

దక్షిణ కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల్లో వేగంగా ప్రవహిస్తున్న నీటి నుంచి రెస్క్యూ సిబ్బంది సోమవారం పలువురిని కాపాడారు.

(9 / 9)

దక్షిణ కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల్లో వేగంగా ప్రవహిస్తున్న నీటి నుంచి రెస్క్యూ సిబ్బంది సోమవారం పలువురిని కాపాడారు.(Getty Images via AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు