
(1 / 5)
గ్రహాలు కాలానగుణంగా సంచరిస్తూ శుభయోగాలను ఏర్పరుస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ బుధాదిత్య యోగం ఏర్పడింది.

(2 / 5)
మార్చి 15న సూర్యదేవుడు మీనరాశిలో ప్రవేశించాడు. దీంతో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు వస్తాయి.

(3 / 5)
వృషభ రాశి వారికి బుధాదిత్య రాజ్య యోగం ఎంతో శుభప్రదం. ఇది వారి రాశిలోని 11వ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల వారి ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. పెట్టుబడి నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు వారి కెరీర్ లో పురోగతి సాధిస్తారు.

(4 / 5)
బుధాదిత్య రాజయోగం మిధున రాశి వారికి పదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీని వల్ల మీ సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా పురోగతి సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి. జీతం పెరగడం వంటి లాభాలు కలుగుతాయి.

(5 / 5)
కుంభరాశి వారికి బుధాదిత్య రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ యోగం వారి రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగి అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. వ్యాపారవేత్తలు కావలసిన డబ్బును అప్పుగా పొందే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు