(1 / 4)
ఈ ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 ఇంచ్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ దీని సొంతం, వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ఇందులో ఉంది.
(2 / 4)
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ మీద పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్‌ని 2టీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. “నో నెట్‌వర్క్ కాల్” ఫీచర్ ఈ గ్యాడ్జెట్లో హైలైట్ ఫీచర్! నెట్‌వర్క్ కవరేజ్ లేనప్పుడు కూడా యూజర్లు కమ్యూనికేట్ చేయవచ్చు.
(3 / 4)
ఈ ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐలో 50ఎంపీ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ సమ్మరైజేషన్, ఏఐ కాల్ ట్రాన్స్‌లేషన్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్, ఏఐ ఎరేజర్, ఏఐ వాల్‌పేపర్ జనరేటర్ వంటి పలు ఏఐ ఫీచర్లు సైతం ఈ గ్యాడ్జెట్లో ఉన్నాయి.
(4 / 4)
ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐ ధర రూ. 9,299. ఆఫర్లో రూ.300 తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ఆగస్ట్ 21న ఫ్లిప్‌కార్ట్, సంస్థ ఆన్లైన్ సైట్ సహా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో సేల్‌లోకి వెళ్లనుంది.
ఇతర గ్యాలరీలు