Budget 2025 : బడ్జెట్ తర్వాత.. ధరలు భారీగా తగ్గిన వస్తువులు ఇవే- మిడిల్ క్లాస్‌కి భారీ రిలీఫ్!
- బడ్జెట్ 2025లో రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన ప్రకటించారు. అయితే దీనితో పాటు కొన్నింటిపై సుంకాలను తగ్గించారు, మరికొన్నింటిపై పెంచారు. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? పూర్తి లిస్ట్ చూసేయండి..
- బడ్జెట్ 2025లో రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన ప్రకటించారు. అయితే దీనితో పాటు కొన్నింటిపై సుంకాలను తగ్గించారు, మరికొన్నింటిపై పెంచారు. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? పూర్తి లిస్ట్ చూసేయండి..
(1 / 6)
36 ప్రాణాలను కాపాడే మందులకు ప్రాథమిక కస్టమ్ డ్యూటీల నుంచి పూర్తిగా మినహాయించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, టచ్ గ్లాస్ షీట్, ఎల్ఈడీ/ఎల్సీడీ టీవీలకు టచ్ సెన్సర్‌పై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
(2 / 6)
మినహాయింపు పొందిన క్యాపిటల్ గూడ్స్ జాబితాలో ఎలక్ట్రానిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ ఉత్పత్తికి 35 కొత్త వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ ఉత్పత్తికి 28 కొత్త వస్తువులు ఉంటాయి. శీతలీకరించిన ఫిష్ పేస్ట్ (సురిమి)పై కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. జల దాణా తయారీ కోసం చేపల హైడ్రోలైసేట@పై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
(3 / 6)
600 సీసీకి మించని ఇంజిన్ సామర్థ్యంపై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి, సెమీ-నాక్డ్ డౌన్ 20 శాతానికి, కంప్లీట్లీ నాక్డ్ డౌన్‌ని 10 శాతానికి తగ్గించారు. ఇంజిన్ సామర్థ్యం 1600 సీసీ, అంతకంటే ఎక్కువ 30 శాతానికి తగ్గించారు. ప్రయోగ వాహనాల నిర్మాణం, ఉపగ్రహాల ప్రయోగానికి ఉపయోగించే వస్తువులపై కస్టమ్స్ సుంకం, దాని విడిభాగాలు, వినియోగ వస్తువులతో సహా ఉపగ్రహాలకు గ్రౌండ్ ఇన్స్టాలేషన్ సున్నా ట్యాక్స్.
(4 / 6)
కెమెరా మాడ్యూల్‌లోని ఇన్పుట్స్/సబ్ పార్ట్స్‌పై కస్టమ్స్ డ్యూటీ, కనెక్టర్లు, వైర్డ్ హెడ్సెట్, మైక్రోఫోన్- రిసీవర్, యూఎస్బీ కేబుల్, ఫింగర్‌ప్రింట్ రీడర్ / సెల్యులార్ మొబైల్ ఫోన్ సెన్సార్‌పై కస్టమ్స్ డ్యూటీని 2.5శాతం నుంచి సున్నా చేశారు. అయాన్ బ్యాటరీ, సీసం, జింక్, యాంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాడ్మియం, మాలిబ్డినం, రీనియం, టాంటాలం, టిన్, టంగ్ స్టన్, జిర్కోనియం, కాపర్ స్క్రాప్‌పై కస్టమ్స్ సుంకం కూడా తగ్గింది.
(5 / 6)
నౌకలు, వాటి విడిభాగాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో పదేళ్ల పాటు పొడిగించారు. వెట్ బ్లూ లెదర్‌పై కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 0కి తగ్గించారు. ఆహారం లేదా పానీయ పరిశ్రమల్లో ఉపయోగించే వాసన పదార్థాల మిశ్రమాలపై కస్టమ్స్ సుంకం 100 నుంచి 20 శాతానికి తగ్గించారు.
ఇతర గ్యాలరీలు