6th Day Flood: ఆరో రోజుకు చేరిన బుడమేరు వరద..14చోట్ల గట్లకు గండ్లు, సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీ సిబ్బంది..
- 6th Day Flood: విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద ఎంతకీ అదుపులోకి రావడం లేదు. బుడమేరు గట్లకు 14చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో భారీ గండ్లను ఇప్పటికీ పూడ్చలేకపోతున్నారు. దీంతో ఆర్మీ సిబ్బంది సాయంతో గండ్లను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. శనివారానికి పనులు కొలిక్కి రావొచ్చు.

(2 / 7)
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరు కు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి.విజయవాడ సింగ్ నగర్ ను ముంపుకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి.
(4 / 7)
శుక్రవారం ఉదయం బుడమేరు గండ్లు పడిన ప్రదేశానికి చేరుకున్న ఆర్మీ సిబ్బందితో చర్చిస్తున్న మంత్రి
(5 / 7)
బుడమేరు ప్రవాహానికి డైవర్షన్ ఛానల్ దిగువున ఎడమ గట్టుకు విజయవాడ దిశలో మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కుడి గట్టుకు 11చోట్ల గండ్లు పడ్డాయి. 31వ తేదీన విజయవాడ రూరల్, జికొండూరు మండలాల్లో 26సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టితో వరద ప్రవాహాన్ని బుడమేరు కాల్వలు తట్టుకోలేకపోయాయి.
(6 / 7)
బుడమేరు ప్రవాహానికి పడిన గండ్లను పూడ్చడానికి మూడు రోజులుగా ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గండి పూడ్చడానికి మట్టిని తరలిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. బుడమేరుకు ఎడమవైపు పడిన గండ్లలో రెండు 60మీటర్ల పొడవుతో ఒకటి 100 మీటర్ల పొడవున ఉంది. ప్రస్తుతం రెండు గండ్లకు మాత్రమే పూడ్చగలిగారు.
ఇతర గ్యాలరీలు