తెలుగు న్యూస్ / ఫోటో /
BSNL Best Recharge Plans : బీఎస్ఎన్‌ఎల్ ఏడాది రీఛార్జ్ ప్లాన్స్.. ఇప్పుడు చేస్తే మళ్లీ 2026 వరకు ఏ బాధ ఉండదు!
BSNL Best Recharge Plans : కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే మీ ఫోన్‌ని ఏడాది పొడవునా రీఛార్జ్ చేయాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే బీఎస్ఎన్‌ఎల్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లను రోజు లెక్కన వేసుకుంటే మీకు చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. అపరిమిత కాల్‌లు, ఎస్ఎంస్, ఇంటర్నెట్ ప్రయోజనాలను పొందుతారు.
(1 / 6)
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడానికి కొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో నిరంతరం ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే మీ ఫోన్‌ని ఏడాది పొడవునా రీఛార్జ్ చేయాలని మీరు ఆలోచిస్తే మీకోసం కొన్ని ఉన్నాయి. వినియోగదారులకు ప్రయోజనాలు ఉంటాయి.
(2 / 6)
BSNL రూ. 2099 ప్లాన్ 425 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ GP-2, అంతకంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, 2జీబీ రోజువారీ డేటా 395 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రయోజనాలు 325 రోజులు. కానీ చెల్లుబాటు 425 రోజులు.
(3 / 6)
BSNL రూ.2399 ప్లాన్ 425 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో 395 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.
(4 / 6)
బీఎస్ఎన్ఎల్ సంవత్సరపు ప్లాన్‌ల జాబితాలో అత్యంత ఖరీదైన ప్లాన్ రూ. 2999. వినియోగదారులకు రోజుకు 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతోపాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 365 రోజులు.
(5 / 6)
ఈ జాబితాలో రూ. 1198 కూడా ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు, ఇది వినియోగదారులకు 300 నిమిషాల వాయిస్ కాలింగ్. 3జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లు 12 నెలల పాటు ప్రతి నెల అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ సిమ్‌గా నడుపుతున్న వారికి ఇది మంచిది.
ఇతర గ్యాలరీలు