తెలుగు న్యూస్ / ఫోటో /
రూ. 200 కంటే తక్కువలో బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్.. కాలింగ్, డేటా బెనిఫిట్స్!
- BSNL Best Prepaid Plans : రూ. 200 కంటే తక్కువ బడ్జెట్‌లో మీ సిమ్‌ను 30 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే, బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు మీకు ఉత్తమంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ డేటా, ఉచిత కాల్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.
- BSNL Best Prepaid Plans : రూ. 200 కంటే తక్కువ బడ్జెట్‌లో మీ సిమ్‌ను 30 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే, బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు మీకు ఉత్తమంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ డేటా, ఉచిత కాల్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.
(1 / 4)
ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ బేస్‌ను బలోపేతం చేయడానికి నిరంతరం కొత్త ప్లాన్‌లను తెస్తుంది. మీరు రూ. 200 కంటే తక్కువ బడ్జెట్‌లో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్స్ అందిస్తోంది. రూ.200 కంటే తక్కువ ధరలో డేటా, కాల్స్ ప్రయోజనాలను పొందుతారు. ఆ ప్లాన్స్ ఏంటో చూద్దాం..
(2 / 4)
తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ కోరుకునే కస్టమర్‌లు బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ భారతదేశంలో స్థానిక, ఎస్టీడీతో సహా 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అయితే ఇది అపరిమిత డేటా లేదా వాయిస్‌ని కలిగి ఉండదు. ఈ ప్లాన్‌లు వాయిస్ కాల్స్‌పై ఆధారపడేవారు, ఎక్కువ డేటా అవసరం లేని వారి కోసం బాగుంటుంది.
(3 / 4)
బీఎస్ఎన్ఎల్ రూ. 153 ప్లాన్‌లో మీరు మొత్తం 90 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందుతారు. కానీ 1జీబీ రోజువారీ డేటా కోటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం 40Kbps అవుతుంది. డేటా ప్రయోజనాలతో పాటు ఈ రూ.153 ప్యాక్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా పొందుతారు.
(4 / 4)
తక్కువ ఖర్చుతో నెల మొత్తం ఉచిత కాలింగ్‌తో పాటు ఎక్కువ డేటా కావాలంటే రూ.199 ప్లాన్‌కి వెళ్లవచ్చు. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు రూ.199 ప్లాన్‌లో పూర్తి 30 రోజుల నెలవారీ చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు 30 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ చేయవచ్చు. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా పొందుతారు. 30 రోజుల పాటు 60జీబీ డేటా వస్తుంది. ప్రతిరోజూ 2జీబీ డేటాను ఉపయోగించవచ్చు.
ఇతర గ్యాలరీలు