BRS MLCs : ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన!-brs mlcs innovative protest for distribute scooties to girls in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brs Mlcs : ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన!

BRS MLCs : ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన!

Published Mar 18, 2025 11:49 AM IST Basani Shiva Kumar
Published Mar 18, 2025 11:49 AM IST

  • BRS MLCs : తెలంగాణ శాసన మండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీల ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయ్యిందని.. హామీ ప్రకారం స్కూటీలు ఎందుకివ్వలేదని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు శాసన మండలి వద్ద స్కూటీల ప్లకార్డులను ప్రదర్శించారు. 

(1 / 6)

మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ సభలో తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

(2 / 6)

దేశంలో అనేక పార్టీలు హామీలు ఇస్తాయి.. కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని.. ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని.. మళ్లీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుందని ఆరోపించారు. 

(3 / 6)

ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చి 15 నెలలు అయ్యిందన్నారు. నిన్న తులం బంగారం ఇయ్యమని శాసన మండలి సాక్షిగా చెప్పారు.. నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

(4 / 6)

లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు.. హామీలు విస్మరించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రియాంక గాంధీకి విద్యార్థులు పోస్ట్ కార్డులు రాస్తున్నారని.. ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

(5 / 6)

ఇటు పేద కుటుంబాలకు చెందిన 18 ఏళ్లు నిండి చదువుకునే అమ్మాయిలకు.. ఎలక్ట్రిక్‌ స్కూటీలు పథకం కింద వాహనాలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది. విద్యార్థిని కుటుంబం బీపీఎల్‌గా గుర్తింపునకు కుటుంబ రేషన్‌ కార్డు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

(6 / 6)

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు