KCR Polam Bata in Karimnagar : పొలం బాటలో కేసీఆర్ - రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపు-brs chief kcr inspected the dry crops in karimnagar district 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kcr Polam Bata In Karimnagar : పొలం బాటలో కేసీఆర్ - రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపు

KCR Polam Bata in Karimnagar : పొలం బాటలో కేసీఆర్ - రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపు

Published Apr 05, 2024 03:06 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 05, 2024 03:06 PM IST

  • KCR Polam Bata in Karimnagar District: పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పలు మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పొలంబాట కార్యక్రమంలో భాగంగా… ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

(1 / 6)

ఉదయమే ఎర్రవెల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్… కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను  పరిశీలించారు. 

(2 / 6)

ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. 

(3 / 6)

ఈ సందర్భంగా ఎండిపోయిన పైరును కేసీఆర్ చూపించారు స్థానిక రైతులు. గతేడాది నీటి కొరత లేదని… ఈసారి నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని వాపోయారు.

(4 / 6)

ఈ సందర్భంగా స్పందించిన కేసీఆర్‌… రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. 

(5 / 6)

 రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని చెప్పారు కేసీఆర్., ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు స్థానిక నేతలు కేసీఆర్ వెంట ఉన్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు