Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు-bridge collapse in us joe biden lauds quick action by indian crew members who saved many lives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bridge Collapse In Us: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Mar 27, 2024, 02:28 PM IST HT Telugu Desk
Mar 27, 2024, 02:28 PM , IST

  • Bridge Collapse: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఓ కార్గో నౌక నది వంతెనను ఢీకొనడంతో.. ఆ వంతెన కుప్పకూలింది. ఆ కార్గో నౌకలోని సిబ్బంది అందరూ భారతీయులే. కార్గో నౌక అదుపుతప్పి వంతెన పైలాన్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన భారతీయ సిబ్బంది ప్రమాద హెచ్చరిక పంపించడంతో పెను ప్రమాదం తప్పింది.

సాంకేతిక సమస్య కారణంగా అదుపు తప్పిన కార్గో నౌక బాల్టిమోర్ వంతెన పైలాన్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కుప్పకూలిన వంతెన ఆ నౌక పైననే పాక్షికంగా పడింది. దాంతో, ఆ నౌక ధ్వంసమైంది.

(1 / 6)

(via REUTERS)

ఆ ప్రైవేటు కార్గో నౌక శ్రీలంకకు వెళ్తున్నట్లు సమాచారం. ఆ నౌకలో ఉన్న సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగా ఉన్నట్లు నౌక యాజమాన్య సంస్థ వెల్లడించింది.

(2 / 6)

ప్రమాదం జరిగిన సమయంలో ఆ నదిలో నీరు సుమారు 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంది. దాంతో, నదిలో పడిపోయిన వాహనాల్లోని వ్యక్తులను కాపాడే ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 

(3 / 6)

(AFP)

బాల్టిమోర్ లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కుప్పకూలి కార్గో నౌక ’దాలి‘ పై పడిన దృశ్యం. కార్గో నౌక ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో వంతెనపై వెళ్తున్న పలు వాహనాలు కింద ఉన్న నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

(4 / 6)

కంటైనర్ నౌక డాలీ సింగపూర్ షిప్పింగ్ కంపెనీకి చెందినది, వంతెన కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తూర్పు తీరంలో నార్త్ - సౌత్ లను ఈ వంతెన కలుపుతుంది. మేరీల్యాండ్ లోని అత్యంత కీలకమైన వంతెన ఇది.

(5 / 6)

(Getty Images via AFP)

ప్రమాదం జరిగిన సమయంలో నౌకలోని భారతీయ సిబ్బంది అప్రమత్తత చాలా మంది ప్రాణాలను కాపాడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. వారు వెంటనే స్పందించి, ప్రమాదంపై హెచ్చరించడంతో బ్రిడ్జ్ పైకి వాహనాలను వెళ్లకుండా నిలిపివేయడం సాధ్యమైందన్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు