తెలుగు న్యూస్ / ఫోటో /
BRAOU BEd Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్
- BRAOU BEd Admissions 2024 : హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ఓడీఎల్) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(1 / 6)
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ఓడీఎల్ కోర్సుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్, అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది.
(2 / 6)
తాజాగా ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్ష డిసెంబర్ 31, 2024వ తేదీన జరగనుంది.
(3 / 6)
బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం https://www.braouonline.in/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపించే B.Ed General on ODL Entrance Test:2024-25 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
(4 / 6)
కొత్త విండోలో డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
(5 / 6)
బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష డిసెంబర్ 31వ తేదీన ఉదయం 09-00 నుండి 11-00 గంటల వరకు జరుగుతుంది. జనవరి, 2025 మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తారు. జనవరి మూడో వారంలో కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు