Bottle Gourd Benefits: సొరకాయ తినడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు కూడా ప్రయోజనమని తెలుసా!
Bottle Gourd Benefits: సొరకాయ తినడం వల్ల శరీరంలో కలిగే అద్భుతాలు బోలెడు. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు జుట్టును, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇవే కాదు, మీరు ఊహించని మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయట.
(1 / 6)
కూరగాయల్లో చాలా తక్కువ మంది ఇష్టపడే ఐటెం సొరకాయ. దీనిని వండుకుని తినడానికి ఎన్ని రకాల ఆప్షన్లు ఉన్నా పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా తెలుసుకోరు. కానీ, ఒక్కసారి సొరకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు తెలిసిన తర్వాత మీ నిర్ణయం మార్చుకుంటారు. అవేంటో చూసేద్దామా..
(Pexel)(2 / 6)
రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఫలితంగా చర్మాన్ని, జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుంది.
(Pexel)(3 / 6)
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో పాటు తక్కువ కేలరీలు ఉంటాయి. ఆకలిని తగ్గించడంతో పాటు శరీరం ఓవర్ హీట్ కాకుండా కాపాడుతుంది.
(Pexel)(4 / 6)
ఇందులో ఎక్కువ శాతం దొరికే నీరు శరీరాన్ని డిటాక్సిఫై చేసి హీట్ తగ్గిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
(Pexel)(5 / 6)
సొరకాయలో 92 శాతం నీరు ఉండటంతో శరీరానికి అవసరమైన మేర నీరు సమకూర్చుతుంది. మనం తీసుకున్న ఆహారం కారణంగా డీహైడ్రేషన్‌కు గురైన శరీరానికి చలువ చేస్తుంది.
(Pexel)ఇతర గ్యాలరీలు