(1 / 6)
సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హిమోగ్లోబిన్ స్థాయిలను సరిగా చూసుకోవాలి. ఆయుర్వేద మూలికలు సహజ, ప్రభావవంతమైన పరిష్కారాలను అందిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.
(Pixabay)(2 / 6)
త్రిఫల శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, హిమోగ్లోబిన్ కోసం ఉపయోగపడుతుంది. త్రిఫల ఐరన్‌తో సహా పోషక శోషణను పెంచడానికి సహాయపడుతుంది. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు.
(HT gallery)(3 / 6)
గలిజేరు ఆకును ఆయుర్వేదంలో పునర్నవ అంటారు. ఇది వర్షాలు పడిన తర్వాత ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు మంచి మెడిసిన్ పునర్నవ. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
(HT gallery)(4 / 6)
శతావరి మెుక్క పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా మహిళలకు చాలా సాయపడుతుందని చెప్పవచ్చు.
(Pixabay)(5 / 6)
ఆయుర్వేద చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ.. వ్యక్తి శరీరం మీద ఆధారపడి ఉంది. కొందరి శరీరాలు భిన్నంగా స్పందిస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఏదైనా కొత్త చికిత్సలు, సప్లిమెంట్లను జోడించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
(Unsplash)(6 / 6)

(Pixabay)ఇతర గ్యాలరీలు