Bhool Bhulaiyaa 3 OTT: అఫీషియల్.. బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు?-bollywood horror comedy movie bhool bhulaiyaa 3 will be streaming on netflix know when to watch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhool Bhulaiyaa 3 Ott: అఫీషియల్.. బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు?

Bhool Bhulaiyaa 3 OTT: అఫీషియల్.. బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు?

Dec 25, 2024, 05:20 PM IST Chatakonda Krishna Prakash
Dec 25, 2024, 05:12 PM , IST

  • Bhool Bhulaiyaa 3 OTT: భూల్ భులయ్యా 3 సినిమా ఓటీటీ డేట్ ఖరారైంది. క్రిస్మస్ సందర్భంగా స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బాలీవుడ్ హారర్ కామెడీ సినిమా భూల్ భులయ్యా 3 చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు.

(1 / 5)

భూల్ భులయ్యా 3 చిత్రం డిసెంబర్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. క్రిస్మస్ సందర్భంగా నేడు (డిసెంబర్ 25) ఈ అప్‍డేట్ ఇచ్చింది నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్. 

(2 / 5)

భూల్ భులయ్యా 3 మూవీ కోసం సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ ఓ వీడియో పోస్ట్ చేసింది. పరుగెడుతున్న కార్తీక్ ఆర్యన్ నెట్‍ఫ్లిక్స్ థీమ్ సౌండ్‍కు భయపడినట్టుగా ఈ వీడియోలో ఉంది. హారర్ మూవీ కావడంతో ఇలా నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసింది. డిసెంబర్ 27న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని వీడియో చివర్లో తెలిపింది. 

(3 / 5)

భూల్ భులయ్యా 3 సినిమా థియేటర్లలో దీపావళి సందర్భంగా నవంబర్ 1న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్‍తో పాటు విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‍, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. 

(4 / 5)

భూల్ భులయ్యా 3 సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు  రూ.417కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లు సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు