Cricketers Heroines Marriage: క్రికెటర్స్‌ను పెళ్లాడి ఇండస్ట్రీ వదిలేసిన హీరోయిన్స్ వీళ్లే..
Cricketers Heroines Marriage: పాపులర్ క్రికెటర్స్, స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ప్రేమలో పెళ్లి చేసుకున్నారు. అనుష్క శర్మ నుంచి అథియా శెట్టి వరకు క్రికెటర్స్ ను పెళ్లాడి హీరోయిన్ గా చేయకుండా ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో చూద్దాం.
(1 / 7)
అనుష్క-అథియా నుంచి హాజెల్ కీచ్ వరకు ఇండస్ట్రీని వదిలేసి క్రికెటర్లను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీలు ఎందరో ఉన్నారు. యాక్టర్స్‌ను కాదని క్రికెటర్లను తమ తోడుగా చేసుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.
(2 / 7)
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ 2017లో పెళ్నలి చేసుకున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లితో ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. విరాట్, అనుష్క దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
(3 / 7)
అతియా శెట్టి-కెఎల్ రాహుల్: సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి 2023 సంవత్సరంలో భారత బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌ను వివాహం చేసుకుంది, అథియా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
(4 / 7)
గీతా బస్రా-హర్భజన్ సింగ్: నటి గీతా బస్రా 2015లో భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ఏడు అడుగులు వేసి వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇప్పుడు చాలా అన్యూన్యంగా ఉంటున్నారు.
(5 / 7)
హాజెల్ కీచ్-యువరాజ్ సింగ్: నటి హాజెల్ కీచ్ ఇప్పటివరకు చాలా తక్కువ చిత్రాలలో కనిపించింది. ఆమె 2016 సంవత్సరంలో భారత మాజీ ఆల్ రౌండర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. హాజెల్ కీచ్ సల్మాన్ బాడీగార్డ్ మూవీలో నటించింది. అలాగే హిందీలో అ అంటే అమలాపురం ఐటమ్ సాంగ్ చేసింది.
(6 / 7)
సాగరిక ఘట్గే-జహీర్ ఖాన్: నటి సాగరిక ఘట్గే 2017 సంవత్సరంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ చక్ దే సినిమాలో సాగరిక కీ రోల్ ప్లే చేసింది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
ఇతర గ్యాలరీలు