పెళ్లికి ముందే దర్శకుడితో శృంగారం, బలవంతంగా అబార్షన్- లాకప్‌లో ఏడుస్తూ చెప్పిన హీరోయన్- బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫొటోలు-bollywood heroine bigg boss contestant mandana karimi reveals her pregnancy with director in kangana ranaut lock upp ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పెళ్లికి ముందే దర్శకుడితో శృంగారం, బలవంతంగా అబార్షన్- లాకప్‌లో ఏడుస్తూ చెప్పిన హీరోయన్- బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫొటోలు

పెళ్లికి ముందే దర్శకుడితో శృంగారం, బలవంతంగా అబార్షన్- లాకప్‌లో ఏడుస్తూ చెప్పిన హీరోయన్- బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫొటోలు

Published May 10, 2025 07:01 PM IST Sanjiv Kumar
Published May 10, 2025 07:01 PM IST

ఓ దర్శకుడితో రిలేషన్‌షిప్‌లో ఉండి గర్భం దాల్చింది ఓ హీరోయిన్. ఆ డైరెక్టర్ బిడ్డను కనడానికి ఇష్టపడకపోవడంతో బలవంతంగా అబార్షన్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని ఆ హీరోయిన్ చెప్పుకొచ్చింది. మరి హీరోయిన్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

సినీ తారల ప్రేమ వార్తలు, లవ్, రిలేషన్‌షిప్ ఇలా రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రేమ కారణంగా హెడ్‌లైన్స్‌లో కూడా నిలుస్తున్నారు. ఇక్కడ మనం ఓ దర్శకుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక బాలీవుడ్ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. పెళ్లి కాకుండానే డైరెక్టర్‌తో గర్భవతి అయింది. బిడ్డను కనడానికి తన బాయ్‌ఫ్రెండ్ ఒప్పుకోకపోవడంతో ఆమె బలవంతంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.

(1 / 8)

మనం మాట్లాడుతున్న బాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ హిందీ సీజన్ 9 కంటెస్టెంట్ మందనా కరిమి గురించి. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నిర్వహించే 'లాకప్' షోలో మందనా కరిమి స్వయంగా ఈ విషయాన్ని ఏడుస్తూ బయటపెట్టింది. ఓ ఫిల్మ్ మేకర్‌తో తాను సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మందనా వెల్లడించింది.

(2 / 8)

"లాక్‌డౌన్ సమయంలో నేను (దర్శకుడితో) కలిసి జీవించడం ప్రారంభించాను. ఆయనకు అదివరకే పెళ్లి కావడం, కానీ భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడంతో మా రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచాం. ఆ దర్శకుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పేవారు. నేను కూడా అతన్ని నా భాగస్వామిగా భావించాను. నన్ను తన ప్రేమ అని పిలిచేవాడు" అని మందనా చెప్పింది.

(3 / 8)

"మేము ఒక బిడ్డను కనాలని అనుకున్నాము, కానీ, నేను గర్భవతిని అయినప్పుడు తాను వెనక్కి తగ్గాడు. తాను మళ్లీ తండ్రిని కావడానికి  మానసికంగా సిద్ధంగా లేనని చెప్పారు. అప్పటికే ఆయనకు ఒక సంతానం ఉంది. ఒకరోజు 'నువ్వు అంత తేలిగ్గా గర్భం దాల్చావంటే నమ్మలేకపోతున్నాను, అది కూడా 33 ఏళ్లకే!' అని ఆయన ఆశ్చర్యంగా అన్నారు" అని మందనా చెప్పుకొచ్చింది.

(4 / 8)

"ఆ తర్వాత నన్ను ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. మేము అక్కడికి వెళ్లినప్పుడు ఆయన తండ్రి కావడానికి సిద్ధంగా లేడని తన ఫ్రెండ్స్‌తో చెప్పించాడు. నా స్నేహితులు కూడా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించేలా మొత్తం ప్లాన్ చేశాడు. మేము ఇంటికి వచ్చాక, నువ్ ఇది అర్థం చేసుకోవాలని, నా మాజీ ఇప్పటికీ నా నుంచి విడిపోలేదని, నాపై పబ్లిక్ కేసు ఉందని చెప్పాడు. దాంతో నాకు అయిష్టాంగానే అబార్షన్ జరిగింది" అని హీరోయిన్ మందనా కరిమి కన్నీళ్లతో వెల్లడించింది.

(5 / 8)

అయితే, ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి అనర్హుడు అని, కాబట్టి అతని పేరును ప్రస్తావించదలుచుకోలేదని బిగ్ బాస్ కంటెస్టెంట్ మందనా కరిమి తెలిపింది.

(6 / 8)

ఆ తర్వాత మందనాతో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "సమానత్వం గురించి మనం ఎంత మాట్లాడినా మనకే ఇలా జరుగుతుంది. ఏ వ్యక్తి సరైనవాడు, ఏ వ్యక్తి తప్పుడు మనిషి అని అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సంవత్సరాలు వేచి ఉండటం సాధ్యం కాదు. మనం (మహిళలు) తల్లులు కావాలని కోరుకుంటాం. మీరు వ్యవహరించిన తీరు చాలా ధైర్యవంతమైంది. ఇది మీ ఇష్టం అయినప్పటికీ, మీరు శిశువును ఉంచి ఉండాల్సిందని నేను అనుకుంటున్నాను" అని తెలిపింది.

(7 / 8)

దాంతో అబార్షన్ చేయించుకోవాలని ఆమె ఎందుకు నిర్ణయించుకుందో చెప్పుకొచ్చింది మందనా. “రిలేషన్‌షిప్‌లో లేని ఓ వ్యక్తి నా కొడుకుకు తండ్రిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను విచ్ఛిన్నమైన కుటుంబం నుండి వచ్చాను కాబట్టి ఆ భావోద్వేగ ప్రభావాన్ని నేను అర్థం చేసుకోగలను” అని మందనా కరిమి రిప్లై ఇచ్చింది.’

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు