Controversy Celebrities: కాంట్రవర్సీలతో కెరీర్ క్లోజ్ చేసుకున్న హీరో హీరోయిన్లు
Controversy Celebrities In Bollywood: సెలబ్రిటీలకు కాంట్రవర్సీలు సర్వసాధారణమే. కానీ, కొంతమంది హీరో హీరోయిన్స్ మాత్రం పలు వివాదస్పద కారణాలతో తమ సినీ కెరీర్ ముగిసిపోయేలా చేసుకున్నారు. మరి ఆ బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో చూద్దామా!
(1 / 8)
గ్లామర్ కు పెట్టింది పేరైనప్పటికీ బాలీవుడ్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదాల్లో కొంతమంది పెద్ద స్టార్ల కెరీర్లను సైతం ఛిన్నాభిన్నం చేశాయి. వ్యక్తిగత, న్యాయపరమైన సమస్యల కారణంగా కాంట్రవర్సీ సంఘటనలు బాలీవుడ్ సెలబ్రిటీ కెరీర్ ను ఎలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
(2 / 8)
రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షైనీ అహుజా బాలీవుడ్ లో 'గ్యాంగ్ స్టర్', 'వో లమ్హే' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2009లో ఇంటి పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో అతని కెరీర్ ఆగిపోయింది. ఈ కేసును మీడియాలో విస్తృతంగా కవర్ చేయడంతో షైనీని అరెస్టు చేశారు. అనంతరం అతడిని దోషిగా తేల్చారు. అయితే బెయిల్ పై విడుదలైన ఆయన బాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం చాలానే ప్రయత్నించారు. కానీ, ఆరోపణలు, నేరారోపణలు అతని ప్రతిష్ఠను ఎంతగా దెబ్బతీశాయంటే అతని కెరీర్‌ను తిరిగి తీసుకురానంతగా.
(3 / 8)
సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ టాప్ యాక్టర్స్‌లో ఒకరు. అయితే ఆయన ఓ న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో చిక్కుకోవడంతో ఆయనకు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ లో అతని అశ్లీలత స్వరూపం బయటపడింది. కాస్టింగ్ కౌచ్ ఏర్పాటు చేయమని ఒక జర్నలిస్ట్ కు సలహా ఇవ్వడం, ఈ దృశ్యాలు జాతీయ టెలివిజన్ లో ప్రసారం కావడంతో తీవ్ర దుమారం రేగింది. అతని ప్రతిష్ఠ కోలుకోలేని విధంగా దెబ్బతింది, తర్వాత ఆయన నటించలేదు. కానీ, ఇటీవల యానిమల్ మూవీలో చిన్న రోల్ చేశారు.
(4 / 8)
'ప్రేమ్ అగన్', 'జంగిల్' వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా మారాడు. కానీ, 2001లో కొకైన్ డ్రగ్స్ కలిగి ఉన్నందుకు అరెస్ట్ కావడంతో కెరీర్ కోల్పోయాడు. అతను తన కెరీర్ ను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు, కానీ తన మునుపటి స్థానాన్ని మాత్రం తిరిగి పొందలేకపోయాడు. మాదకద్రవ్యాలకు సంబంధించిన అతని అరెస్టు కలకలం రేపింది. దాంతో అతని ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.
(5 / 8)
అమన్ వర్మ క్యాస్టింగ్ కౌచ్ స్కాండల్ లో ఇరుక్కున్నాడు. టీవీ షోలు, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమన్ వర్మ క్యాస్టింగ్ కౌచ్ స్కాండల్ లో ఇరుక్కుని కెరీర్ ముగిసేలా చేసుకున్నాడు. 2005లో ఓ సినిమాలోని పాత్రకు బదులుగా ఓ నటి నుంచి సెక్స్ కోరిన వీడియో క్లిప్ ఒకటి బయటకు రావడంతో అమన్ కెరీర్ ముగిసింది.
(6 / 8)
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు మమతా కులకర్ణి చిక్కుకుంది. 1990వ దశకంలో ప్రముఖ నటి అయన మమతా తన బోల్డ్ నటనకు, గ్లామరస్ ఇమేజ్ కు పెట్టింది పేరు. కానీ, భారీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇరుక్కోవడంతో ఆమె కెరీర్ నాశనమైంది. 2016 లో ఆమె నుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు మమత, ఆమె భర్తను అనుమానితులుగా అభియోగాలు వచ్చాయి. ఈ కుంభకోణం బాలీవుడ్ ను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంత తీవ్రమైన నేరానికి పాల్పడటంతో ఆమె నట జీవితానికి ముగింపు పలికింది.
(7 / 8)
నటుడు ఆదిత్య పంచోలి, నటి జరీనా వహాబ్ కుమారుడు సూరజ్ పంచోలి, మధ్య జరిగిన విషాద సంఘటనతో అతని కెరీర్ నాశనం అయింది. 'నిశ్శబ్దం', 'గజిని ' వంటి చిత్రాల్లో నటించిన జియాఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. జియా 2013లో తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టారు. జియా ఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న సూరజ్ పై దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటనతో అతని కెరీర్ ముగిసిపోయింది.
(8 / 8)
1990వ దశకంలో మంచి కెరీర్ ఉన్న నటి మోనికా బేడీ. అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం, మోనికా బేడీకి ఉన్న సంబంధం కారణంగా ఆమె కెరీర్ కు ఫుల్ స్టాఫ్ పెట్టాల్సి వచ్చింది. నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు 2002లో పోర్చుగల్ లో వీరిద్దరిని అరెస్టు చేయడంతో వీరి సంబంధం వెలుగులోకి వచ్చింది. రియాలిటీ టీవీ షోల ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ కుంభకోణం నుంచి కోలుకోలేకపోయింది మోనికా బేడీ. దీన్ని బేస్ చేసుకునే రవితేజ క్రాక్ మూవీలో ఓ సీన్ పెట్టారు.
ఇతర గ్యాలరీలు