తెలుగు న్యూస్ / ఫోటో /
Bollywood: న్యూఇయర్ కోసం వెకేషన్లకు వెళ్లిన బాలీవుడ్ తారలు.. కరీనా, తృప్తి డిమ్రి, రకుల్ సహా మరికొందరు: ఫొటోలు
Bollywood - New Year 2025: కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు కొందరు బాలీవుడ్ తారలు విదేశాలకు వెకేషన్లకు వెళ్లారు. అక్కడి నుంచి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిని ఇక్కడ చూడండి.
(1 / 10)
కొత్త సంవత్సరం 2025ను ఆహ్వానించేందుకు వెకేషన్లకు వెళ్లారు కొందరు బాలీవుడ్ సినీ స్టార్లు. న్యూఇయర్ ట్రిప్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Instagram)
(2 / 10)
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్.. ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. కుటుంబంతో వెకేషన్‍లో సంతోషంగా గడుపుతున్నారు. (Instagram)
(3 / 10)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు డిసెంబర్ 31న పోస్ట్ చేశారు కరీనా. ఈ ఏడాది చివరి సెల్ఫీల్లో కొన్ని అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. (Instagram)
(4 / 10)
హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్.. ఆస్ట్రేలియా ట్రిప్‍కు వెళ్లారు. ట్రిప్‍ను ఉల్లాసంగా గడుపుతున్నారు.(Instagram)
(5 / 10)
సోనాక్షి, జహీర్.. సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రపు అందాలను లోపలికి వెళ్లి చూశారు. (Instagram)
(6 / 10)
గాల్లో తేలుతూ స్కైడైవింగ్, బంగీ జంప్ లాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ కూడా చేశారు సోనాక్షి, జహీర్. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు.(Instagram)
(7 / 10)
న్యూఇయర్ సందర్భంగా ఫిన్‍ల్యాండ్ ట్రిప్‍కు వెళ్లారు బాలీవుడ్ యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి. హిమపాతంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.(Instagram/HT City)
(8 / 10)
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి.. ఫిన్‍ల్యాండ్‍లోని ల్యాప్‍లాండ్‍కు వెకేషన్‍కు వెళ్లారు. పిల్లలతో సమయం సంతోషంగా గడుపుతున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. (Instagram)
(9 / 10)
తమ వెకేషన్ ఫొటోలను సుషానే ఖాన్ కూడా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు.(Instagram)
ఇతర గ్యాలరీలు