తెలుగు న్యూస్ / ఫోటో /
Anant Ambani-Radhika Sangeet: చీరల్లో బాలీవుడ్ భామల అందాల తళుకులు: ఫొటోలు
Anant Ambani- Radhika Merchant Sangeet: అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ సంగీత్ గ్రాండ్‍గా జరిగింది. ఈ వేడుకకు కొందరు బాలీవుడ్ అందాల భామలు చీర ధరించి తళుక్కుమన్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 9)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుక ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సెలెబ్రేషన్లకు సినీ స్టార్లతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు కొందరు బాలీవుడ్ నటీమణులు చీర ధరించి అందాల మెరుపులు మెరిపించారు. స్టన్నింగ్ లుక్‍లో కనిపించారు. (Instagram)
(2 / 9)
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ పర్పుల్ కలర్ చీరలో మరింత అందంగా కనిపించారు. గర్బిణిగా ఉన్న దీపిక బేబి బంప్‍తో ఈ శారీ ధరించి వేడుకకు వచ్చారు. అద్భుతమైన లుక్‍తో సంగీత్ ఫంక్షన్‍కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా నిలిచారు. (Instagram/@deepikapadukone)
(3 / 9)
ఖుషి కపూర్ పింక్ కలర్ మోడ్రన్ శారీ ధరించారు. దీనికి మ్యాచ్ అయ్యేలా ఫుల్ స్లీవ్ బ్లౌజ్ వేసుకున్నారు. అట్రాక్టివ్ పోజులతో ఆకట్టుకున్నారు. (Instagram/@khushi05k)
(4 / 9)
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన షైనింగ్ చీరలో తళుక్కున మెరిశారు. ఆఫ్ షోల్డర్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్ ధరించి హాట్‍గా కనిపించారు. మోడ్రన్ స్టైల్ చీరలో అనన్య ఎలిగెంట్ లుక్‍తో మెప్పించారు. (HT photo/VarinderChawla)
(5 / 9)
షెహజాన్ గిల్ అట్రాక్టివ్ చీరలో షైన్ అయ్యారు. షిమ్మరింగ్ గోల్డెన్ చీరలో ఈ సీనియర్ నటి గ్లామరస్‍గా కనిపించారు. (HT Photo/Varinder Chawla)
(6 / 9)
బ్రౌన్ కలర్ చీరలో మౌనీ రాయ్ హొయలు ఒలికించారు. చమ్కీల చీర, బ్రాలెట్ బ్లౌజ్ ధరించి గ్లామరస్‍గా అట్రాక్ట్ చేశారు.(HT photo/VarinderChawla)
(7 / 9)
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ బంగారు రంగు చీరలో మైమరిపించారు. స్వీట్ హార్ట్ నెట్‍లైన్ బ్లౌజ్ ధరించి మోడ్రన్ లుక్‍తో మెప్పించారు. (HT photo/VarinderChawla)
(8 / 9)
బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ కూడా గోల్డెన్ కలర్ శారీలో మైమరింపించారు. తళుకుల ప్యాటెర్న్ చీరలో మరింత అందంగా కనిపించారు. (HT photo/VarinderChawla)
ఇతర గ్యాలరీలు