Tripti Dimri: నేషనల్ క్రష్ అందాల ఆరబోత.. రొమాంటిక్ మూవీస్‌తో భారీగా పెరిగిన త్రిప్తి డిమ్రి క్రేజ్!
National Crush Tripti Dimri: ఒకే ఒక్క సినిమాతో త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. అందాల్ని ఆరబోస్తూ ఆమె నటిస్తున్న రొమాంటిక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతున్నాయి. యూత్‌లోనూ త్రిప్తి డిమ్రి క్రేజ్ పెరిగిపోయింది. దాం
(1 / 10)
యానిమల్ సినిమాలో తన అందచందాలతో కుర్రాళ్లని కట్టిపడేసిన త్రిప్తి డిమ్రి.. ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
(tripti_dimri/Instagram)(2 / 10)
ఇటీవల త్రిప్తి డిమ్రి నటించిన ‘బ్యాడ్ న్యూస్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. అలానే ఈ భామకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ మూవీలో గ్లామర్ డోస్‌ను త్రిప్తి డిమ్రి మరింతగా పెంచేసింది.
(tripti_dimri/Instagram)(3 / 10)
అందాల ఆరబోతలో త్రిప్తి డిమ్రి ఏ హీరోయిన్‌కీ తగ్గడం లేదు. అలానే యాక్టింగ్‌లోనూ సున్నితమైన హావభావాలను కూ చక్కగా పలికించగలదు. దాంతో సౌత్ నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
(tripti_dimri/Instagram)(4 / 10)
యానిమల్, బ్యాడ్ న్యూస్ హిట్ కావడంతో లక్కీ గర్ల్‌గా మారిపోయిన త్రిప్తి డిమ్రితో పుష్ప-2లొ ఐటెం సాంగ్ చేయించేందుకు డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే.. ఆ విషయాన్ని పుష్ప టీమ్ గోప్యంగా ఉంచుతోంది.
(5 / 10)
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు త్రిప్తి డిమ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తనకి పాయింట్ ఆఫ్ వ్యూ షాట్, ఫొటోగ్రఫీ డైరెక్టర్ అంటే కూడా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తెలియదని దాంతో సెట్స్‌లోనే అన్నీ నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.
(tripti_dimri/Instagram)(6 / 10)
2018లో వచ్చిన లైలా మజ్ను సినిమా సమయంలో భాష అర్థంకాక తాను సెట్స్‌లోనే ఏడ్చేసినట్లు త్రిప్తి డిమ్రి గుర్తు చేసుకుంది. రోజూ షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి పట్టుదలతో భాషని నేర్చుకున్నట్లు తెలిపింది.
(tripti_dimri/Instagram)(7 / 10)
నేషనల్ క్రష్‌గా ఉన్న త్రిప్తి డిమ్రి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అనీస్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నటిస్తున్న త్రిప్తి డిమ్రి.. జాన్వీ కపూర్ గతంలో నటించిన దఢక్ మూవీ సీక్వెల్ దఢక్ -2లోనూ నటిస్తోంది.
(tripti_dimri/Instagram)(8 / 10)
జాన్వీ కపూర్ తరహాలో సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని త్రిప్తి డిమ్రి ప్రయత్నిస్తోంది. అయితే.. క్రేజ్ దృష్ట్యా ఈ అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ అడుగుతుండటంతో సౌత్ ప్రొడ్యూసర్లు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
(tripti_dimri/Instagram)(9 / 10)
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు హాలిడే ట్రిప్‌కి తరచూ త్రిప్తి డిమ్రి వెళ్తుంటుంది. ప్లేస్‌తో పాటు వెకేషన్ ఫొటోల్ని అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేస్తుంటుంది.
(tripti_dimri/Instagram)ఇతర గ్యాలరీలు