(1 / 6)
ఫిల్మ్‌ఫేర్ మ్యాగజీన్ ఆగస్టు ఎడిషన్‍కు కవర్ స్టార్‌గా బాలీవుడ్ హీరోయిన్ కృతిసన్ కనిపించారు. ఈ ఫొటో షూట్‍కు సంబంధించిన ఫొటోలను నేడు కృతి షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్‍లో అందాలతో ఆకట్టుకున్నారు ఈ భామ.
(Instagram)(2 / 6)
బ్లాక్ కలర్ బ్రాలెట్, స్కర్ట్ సెట్ ధరించి హాట్ లుక్‍తో మెప్పించారు కృతి సనన్. హైరైజ్ వైస్ట్, బ్యాక్ స్లిట్, మ్యాక్సీ లెంత్‍తో స్కర్ట్ డిఫరెంట్‍గా ఉంది. ఈ ట్రెండీ డ్రెస్‍లో కిర్రాక్ పోజులు ఇచ్చారు కృతి.
(Instagram)(3 / 6)
బ్లాక్ వెల్వెట్ గౌన్‍తో మరో ఔట్‍ఫిట్‍లో తళుక్కుమన్నారు కృతి సనన్. డీప్ హాల్టర్ నెక్‍లైన్, థైహై స్లిట్‍తో ఉన్న ఈ హాట్ డ్రెస్‍లో గ్లామర్ ట్రీట్ చేశారు ఈ బ్యూటీ.
(Instagram)(4 / 6)
ఈ అట్రాక్టివ్ ఔట్‍ఫిట్‍ల్లో చూపుతిప్పుకోలేని అందంతో కృతి మైమరిపించారు. నేడు (ఆగస్టు 11) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. కృతి లుక్‍కు ఫ్యాన్స్ వారెవా అంటున్నారు.
(Instagram)(5 / 6)
ఈ ఏడాది క్రూ సినిమాతో కృతి సనన్ మంచి హిట్ కొట్టారు. కరీనా కపూర్, టబుతో కలిసి ఈ మూవీలో మెయిన్ రోల్ చేశారు. రూ.150కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది.
(Instagram)(6 / 6)
కృతి సనన్ ప్రస్తుతం దోపత్తీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనే నేరుగా రానుంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే తీన్‍పత్తీ రిలీజ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది.
(Instagram)ఇతర గ్యాలరీలు