AP Tourism : తాటిపూడిలో 'అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్' - ఈ టూరిస్ట్ స్పాట్ అందాలను అస్వాదించాల్సిందే..!-boating services have resumed in thatipudi reservoir in vizianagaram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : తాటిపూడిలో 'అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్' - ఈ టూరిస్ట్ స్పాట్ అందాలను అస్వాదించాల్సిందే..!

AP Tourism : తాటిపూడిలో 'అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్' - ఈ టూరిస్ట్ స్పాట్ అందాలను అస్వాదించాల్సిందే..!

Jan 03, 2025, 07:11 PM IST Maheshwaram Mahendra Chary
Jan 03, 2025, 07:11 PM , IST

  • విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయరులో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌తో బోటింగ్ కు ఏర్పాట్లు చేశారు. పీపీపీ విధానంలో ఇక్కడ టూరిజం అభివృద్ధికి చ‌ర్య‌లు చేపట్టారు.

పచ్చిన కొండలు.. మధ్యలో స్వచ్ఛమైన జలాశయం… ఇలాంటి చోట బోటింగ్ చేస్తే  ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేం. అలాంటి అద్భుతాలకు విజయనగరం జిల్లాలోని  తాటిపూడి రిజర్వాయర్ వేదికైంది. ఇక్కడ విశేషాలెంటో ఇక్కడ చూడండి…

(1 / 7)

గంట్యాడ మండల పరిధిలో ఉన్న తాటిపూడి రిజర్వాయరులో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సేవలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌తో బోటింగ్ కు ఏర్పాట్లు చేశారు. పీపీపీ విధానంలో ఇక్కడ టూరిజం అభివృద్ధికి చ‌ర్య‌లు చేపట్టారు.

(2 / 7)

తాటిపూడి రిజర్వాయర్‌లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రాంతాన్ని శుక్రవారం(జనవరి 3, 2025) రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పాలవలస యశస్విని పాల్గొన్నారు.

(3 / 7)

వాటర్ టాక్సీ, స్వాన్ బోటు, గల్ఫ్ బ్రీజ్, కయాక్, పెడల్ బోటు, ఫన్ యాక్ తదితర రకాల బోట్ల ద్వారా పర్యాటకులు విహరించేందుకు అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. తద్వారా పర్యాటకంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ది చెందుతుంది. 

(4 / 7)

ఇక్కడ ప్రస్తుతం 13 బోట్లు పర్యాటకులను జలవిహారంలో ఆనందింపజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాలుగేళ్ల కిందట గోదావరి నదిలో ప్రమాదం తర్వాత ఇక్కడ కూడా బోటింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ప్రయత్నాలతో.. తాజాగా బోటింగ్ సేవలు షురూ అయ్యాయి.

(5 / 7)

ప్రకృతిలో ఆహ్లాదంగా గడిపి రావాలనుకునే వారు తాటిపూడి రిజర్వాయర్ మంచి ప్లేస్ అని ఏపీ టూరిజం అధికారులు చెబుతున్నారు. బోటింగ్ ద్వారా జలాశయంలో తిరుగూ ప్రకృతి అందాలను అస్వాదించవచ్చని పేర్కొంటున్నారు. 

(6 / 7)

 విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని తాటిపూడిలో గల గోస్తానీ నదిపై  తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంటుంది.  ఇది విజయనగరం జిల్లాలో అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా పేరొందింది, 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు