Papikondalu Tourism : పాపికొండలు చూసొద్దాం...చలో చలో..! నేటి నుంచి రాకపోకలు షురూ, మొదలైన టూరిస్టుల సందడి
- టూరిస్టులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఇవాళ్టి నుంచి పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం కానుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత విహారయా ఏపీత్రకు టూరిజం శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి బోట్లు బయల్దేరనున్నాయి. పాపికొండలు ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది.

(1 / 6)
మళ్లీ పాపికొండల పర్యాటక సందడి మొదలైంది. వరదల సీజన్ ముగియడంతో
టూరిజం శాఖ అధికారులు పర్యాటక సీజన్‌కు పచ్చజెండా ఊపారు. దీంతో పాపికొండలు పరిసర ప్రాంతాల్లో టూరిస్టుల సందడి మొదలైంది.
(Image Source AP Tourism)(2 / 6)
దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత విహారయా ఏపీత్రకు టూరిజం శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి బోట్లు బయల్దేరనున్నాయి.
(Image Source Telangana Tourism)(3 / 6)
జూలై నుంచి పాపికొండల యాత్రను నిలిపివేశారు. ఇటీవల గోదావరికి వరద ఉద్ధృతి తగ్గటంతో పాపికొండల పర్యాటక యాత్రను పునరుద్ధరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పాపికొండ యాత్రకు వెళ్లేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
(Image Source AP Tourism)(4 / 6)
బోటింగ్ కు పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు. ఏపీ టూరిజం శాఖకు సంబంధించి ఇప్పటికే టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
(Image Source AP Tourism)(5 / 6)
గత ఘటనల దృష్ట్యా… పాపికొండల్లో ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి రక్షణ చర్యలతో పాపికొండల విహారయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
(Image Source AP Tourism)ఇతర గ్యాలరీలు