Telangana Tourism : అందాల 'బ్లాక్ బెర్రీ ఐలాండ్' రమ్మంటోంది..! టికెట్ బుకింగ్స్ ప్రారంభం-blackberry island in mulugu district booking begins for staying ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : అందాల 'బ్లాక్ బెర్రీ ఐలాండ్' రమ్మంటోంది..! టికెట్ బుకింగ్స్ ప్రారంభం

Telangana Tourism : అందాల 'బ్లాక్ బెర్రీ ఐలాండ్' రమ్మంటోంది..! టికెట్ బుకింగ్స్ ప్రారంభం

Jan 19, 2025, 06:08 AM IST Maheshwaram Mahendra Chary
Jan 19, 2025, 06:08 AM , IST

  • Blackberry Island in Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ లో అందాల బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌ సిద్ధమైంది. విడిది చేసేందుకు టూరిస్టులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసే ప్రాసెస్ షురూ అయింది. టూరిస్టులు https://oliveelements.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాల తోగు సమీపంలో.. పచ్చని ప్రకృతి అందాల మధ్య.. బ్లాక్ బెర్రీ ఐలాండ్‌‌ను పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది. 

(1 / 9)

ప్రస్తుతం ఈ బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు... తాజాగా టికెట్ బుకింగ్స్ ప్రక్రియ కూడా షురూ అయింది. టికెట్ బుకింగ్ చేసుకొని తాడ్వాయి అడవిలో ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ లో విడిది చేయవచ్చు. 

(2 / 9)

ఆసక్తి గల టూరిస్టులు https://oliveelements.com  లింక్ పై క్లిక్ చేసి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు. ప్యాకేజీ వివరాలతో పాటు టికెట్ ధరలను తెలుసుకోవచ్చు.

(3 / 9)

 సాయంత్రం 4 గంటలకు వస్తే మరునాడు ఉదయం 11 వరకు ఈ ఐల్యాండ్ లోనే స్టే చేయవచ్చు. టూరిస్టులకు స్నాక్స్, టీ ఇస్తారు. రాత్రి భోజనం ఉంటుంది. గేమ్స్ ఆడుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

(4 / 9)

దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్ ఉంది.  ఇక్కడ టూరిస్టులు రాత్రి బస చేసేలా 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉండేలా 25, ముగ్గురు ఉండేలా 21, నలుగురు ఉండేలా 4 గుడారాలను ఏర్పాటు చేశారు. 

(5 / 9)

రాత్రిపూట చలి మంటలు వేసుకునేలా ఏర్పాట్లు చేశారు. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. మరోవైపు అడవిని వీక్షించేలా ఏర్పాటు చేసిన మంచె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

(6 / 9)

దండకారణ్యలో నిర్మించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ వద్ద విద్యుత్ సరఫరా ఉండదు. ఇక్కడ సోలార్ పవర్‌తో ప్రత్యేకంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

(7 / 9)

ఇక్కడికి చేరుకోవడం చాలా సులువు. హైదరాబాద్‌ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా బస్సుల్లో నేరుగా రావొచ్చు. హైదరాబాద్‌ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. ఏపీ నుంచి వస్తే భద్రాచలంలో దిగి.. అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హనుమకొండ బస్సుల్లో రావచ్చు. 

(8 / 9)

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరం ఈ ఐలాండ్ ఉంది. దీనికి సమీపంలోనే రామప్ప ఆలయం, చెరుపు, లక్నవరం సరస్సు, బోగత వాటర్ ఫాల్స్ ఉంటాయి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు