AP TG Bird Flu : బర్డ్‌ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?-bird flu causes decrease in egg and meat consumption in andhra pradesh and telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Bird Flu : బర్డ్‌ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?

AP TG Bird Flu : బర్డ్‌ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?

Published Feb 13, 2025 12:58 PM IST Basani Shiva Kumar
Published Feb 13, 2025 12:58 PM IST

  • AP TG Bird Flu : తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫూ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా.. కోడి మాంసం, గుడ్ల వినియోగం భారీగా తగ్గింది. చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చికెన్ తినొచ్చా.. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఎలా గుర్తించాలి.. నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.

కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకుతుంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారిగా కోడి మాంసంతో పాటు గుడ్ల వినియోగం భారీగా తగ్గిపోయింది. ఇటు పశుసంవర్ధక, రెవెన్యూ, అటవీ, పోలీస్, వైద్య శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారాలను పరిశీలిస్తున్నారు. అస్వస్థతకు గురైన కోళ్లను బయటకు వదులుతున్నారు. 

(1 / 6)

(istockphoto)

ఏపీ, తెలంగాణలో పౌల్ట్రీ రైతులకు అధికారులు పలు సూచనలిస్తున్నారు. రెండు నెలల వరకు కొత్తగా కోడి పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి ఫారాల్లోకి తీసుకురావద్దని స్పష్టం చేస్తున్నారు. ఫారాల్లో యాంటీ వైరస్‌  మందును పిచికారీ చేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కోళ్లు, కోడి పిల్లలను తీసుకురాకుండా చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

(2 / 6)

బర్డ్‌ఫ్లూని ఏవీయన్‌ ఇన్‌ ఫ్లూయంజా అంటారు. ఫ్లూ వైరస్‌ తీవ్రంగా సోకినప్పుడు.. కోడి 48 గంటల్లో చనిపోతుంది. ఇది అంటువ్యాధి కావడంతో ఒక దానినుంచి మరో దానికి త్వరగా సోకే అవకాశం ఉంటుంది. బర్డ్‌ఫ్లూ బారిన పడిన కోళ్లు, గుడ్లు, మాంసం సరిగా ఉడికించకుండా తింటే మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. 

(3 / 6)

వ్యాధి సోకిన కోడి గుడ్లు, కోళ్ల ఉత్పత్తులను విక్రయించేటప్పుడు.. గాలిలోకి వ్యాపించే వైరస్‌ పీల్చడం ద్వారా కూడా  సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు, పక్షులను తాకడమూ ప్రమాదకరమే అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఫ్లూ వైరస్‌ సోకిన కోళ్లను వధించి, భూమిలో లోతుగా పాతి పెట్టాలని సూచిస్తున్నారు. కోళ్లకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు. 

(4 / 6)

కోడి మాంసం తినేవారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో వండి తింటే ఎలాంటి వ్యాధులు సోకవు అని అధికారులు చెబుతున్నారు. పచ్చిగుడ్లు, మాంసం తినవద్దని సూచిస్తున్నారు. మార్కెట్‌ నుంచి కోళ్లు, మాంసం, గుడ్లను తీసుకపోయే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

(5 / 6)

బర్డ్‌ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు చికెన్‌ సెంటర్‌లో తాము తీసుకుంటున్న కోడి చురుగ్గా ఉందా లేదా గమనించాలి. వ్యాధి సోకిన కోడి తల కిందకు వాలిపోయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కోడి కనీసం నిలబడలేని స్థితిలో ఉంటుంది. బర్డ్‌ ఫ్లూ సోకిన కోడి కేవలం 2 నుంచి 3 రోజుల్లో చనిపోతుంది. ఫారం నుంచి బయటికే రాదని చెబుతున్నారు.

(6 / 6)

Basani Shiva Kumar

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు