ATM Web Series Pre Launch Event: ఒక్క రోజు కూడా సెట్‌కు వెళ్లలేదు - హరీష్ శంకర్
ATM Web Series Pre Launch Event: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ ఏటీఎమ్. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్ జనవరి 20న జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్‌సిరీస్ ప్రీ లాంఛ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
(1 / 6)
ఏటీఎమ్ వెబ్‌సిరీస్ ట్రైలర్ చూస్తుంటే సినిమా ట్రైలర్ ఫీలింగ్ కలుగుతోందని దిల్‌రాజు అన్నాడు. తన కూతురు హన్షిత, హర్షిత్ నిర్మించిన తొలి వెబ్ సిరీస్ ఇదని దిల్‌రాజు పేర్కొన్నాడు.
(2 / 6)
ఏటీఎమ్ వెబ్ సిరీస్‌ను దిల్‌రాజు, హరీష్ శంకర్ సమర్పణలో హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించారు.
(3 / 6)
ఏటీఎమ్ వెబ్‌సిరీస్ షూటింగ్ సెట్‌కు ఒక్కరోజు కూడా వెళ్లలేదని హరీష్ శంకర్ అన్నాడు. తాను ఊహించిన దానికంటే అద్భుతంగా చంద్రమోహన్ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడని పేర్కొన్నాడు.
(4 / 6)
ఏటీఎమ్ వెబ్‌సిరీస్‌లో వీజే సన్నీ, దివి, సుబ్బరాజు, దివ్యవాణి, షఫీ కీలక పాత్రలు పోషించారు.
(5 / 6)
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఏటీఎమ్ వెబ్‌సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథను అందించారు. ఈ సిరీస్‌కు చంద్రమోహన్ దర్శకత్వం వహించాడు. గతంలో అతడు శర్వానంద్‌తో రాధ సినిమా చేశాడు.
(6 / 6)
ఏటీఎమ్ ప్రీ లాంఛ్ ఈవెంట్‌కు దర్శకులు క్రిష్, హను రాఘవపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు