Bigg Boss Controversies: లైంగిక వేధింపులు, ఉమ్మి వేయడాలు, గొడవలు.. వివాదాస్పదంగా మారిన బిగ్ బాస్ టాప్ 7 కాంట్రవర్సీలు!-bigg boss top 7 controversies pooja mishra priyanka jagga over bigg boss hindi 18 start on october 6 host by salman khan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bigg Boss Controversies: లైంగిక వేధింపులు, ఉమ్మి వేయడాలు, గొడవలు.. వివాదాస్పదంగా మారిన బిగ్ బాస్ టాప్ 7 కాంట్రవర్సీలు!

Bigg Boss Controversies: లైంగిక వేధింపులు, ఉమ్మి వేయడాలు, గొడవలు.. వివాదాస్పదంగా మారిన బిగ్ బాస్ టాప్ 7 కాంట్రవర్సీలు!

Published Oct 04, 2024 04:54 PM IST Sanjiv Kumar
Published Oct 04, 2024 04:54 PM IST

Bigg Boss Top 7 Controversies: దేశవ్యాప్తంగా బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే, అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్‌లో జరిగిన టాప్ 7 కాంట్రవర్సీలపై లుక్కేద్దాం.

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేయనున్న బిగ్ బాస్ సీజన్ 18 అక్టోబర్ 6, 2024 నుండి ప్రారంభం కానుంది. ఈ షోలో పాల్గొనడానికి చాలా మంది కంటెస్టెంట్లు ముందుకు వచ్చారు. ఈ షో ప్రారంభం నేపథ్యంలో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌజ్‌లో కాంట్రవర్సీగా మారిన కంటెస్టెంట్స్, విషయాలపై లుక్కేద్దాం. 

(1 / 8)

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజా మిశ్రా చాలా వార్తల్లో నిలిచింది.ఈ షోలో పూజా ఇతర కంటెస్టెంట్స్ తో చేసిన ఫైట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

(2 / 8)

ఫ్యాషన్ డిజైనర్ ఇమామ్ సిద్ధిఖీ బిగ్ బాస్ హిందీ 6 హౌస్‌లో తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇమామ్ ఆష్కా గోదారియాను భయపెట్టడమే కాకుండా సల్మాన్ తో వాగ్వాదానికి కూడా దిగాడు. దీంతో వివాదంగా మారాడు. 

(3 / 8)

బిగ్ బాస్ 7 హిందీ సీజన్ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీపై నటి సోఫియా హయత్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో అర్మాన్ కోహ్లీని షో నుంచి బహిష్కరించడమే కాకుండా జైలుకు కూడా పంపారు.

(4 / 8)

ప్రియాంక జగ్గా బిగ్ బాస్ 10 సీజన్‌లో పాల్గొంది. ఈ షోలో ప్రియాంక కంటెస్టెంట్స్ తో గొడవపడటమే కాకుండా వారిని దూషించింది. అంతేకాకుండా బిగ్ బాస్ కంటే తానే ఎక్కువ అని మాట్లాడింది. దాంతో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆమెను హౌస్ నుంచి డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేశాడు.

(5 / 8)

స్వామి ఓం గురువుగా బిగ్ బాస్ 10 లోకి అడుగుపెట్టాడు. అయితే అతని చేష్టలు హెడ్ లైన్స్‌లో నిలిచాయి.  అంతేకాకుండా స్వామి ఓం హౌస్ లోని కంటెస్టెంట్స్ పై మూత్రం పోసి హద్దులు దాటాడు.

(6 / 8)

బిగ్ బాస్‌లో పలు సీజన్లలో కనిపించిన నటి రాఖీ సావంత్ ఒకసారి తన కాఫీని ఎవరూ తాగకుండా ఉమ్మి వేసినట్లు, ఇంట్లో సాక్స్ లో ఆహారాన్ని దాచానని ఆమె మీడియాకు తెలిపింది.

(7 / 8)

డాలీ బింద్రా బిగ్ బాస్ హిందీ సీజన్ 4 లో పాల్గొంది. ఈ షోలో డాలీ ఒకసారి శ్వేతా తివారీపై చేయి ఎత్తింది. దాంతో ఆమె లైమ్ లైట్ లోకి వచ్చింది. అంతే కాకుండా డాలీ తన కుటుంబాన్ని కూడా బాహాటంగా దూషించింది.

(8 / 8)

ఇతర గ్యాలరీలు