(1 / 7)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తో పాపులర్ అయిన సీరియల్ నటి సిరి హనుమంత్ ఆ షో ద్వారా కాస్తా నెగెటివిటీ కూడా మూటగట్టుకుంది. బిగ్ బాస్ అనంతరం పలు సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లు చేసింది బ్యూటిఫుల్ సిరి హనుమంత్.
(YouTube/Jabardasth/ETV Win OTT)(2 / 7)
బిగ్ బాస్ షో, సినిమాల తర్వాత ఈటీవీ వేదికగా ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సిరి హనుమంత్. అంతకుముందున్న యాంకర్ సౌమ్య రావు ప్లేసులో జబర్దస్త్ షోకి హోస్ట్‌గా వచ్చిన సిరి హనుమంత్ తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంది.
( YouTube/Jabardasth/ETV Win OTT)(3 / 7)
జబర్దస్త్ షో ఆరంభంలో ఎన్నో పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన సిరి హనుమంత్ హాట్ అండ్ గ్లామర్ షో కూడా చేసింది. పొట్టి, బోల్డ్ డ్రెస్సుల్లో హాట్‌గా పోజులు ఇస్తూ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసింది బ్యూటిఫుల్ సిరి హనుమంత్.
( YouTube/Jabardasth/ETV Win OTT)(4 / 7)
అయితే, అనుకోకుండా జబర్దస్త్ సడెన్‌గా మానేసింది సిరి హనుమంత్. అందుకు గల కారణాలు తెలియరాలేదు. రీసెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ మానేయడానికి గల అసలు కారణాలను చెప్పింది బుల్లితెర ముద్దుగుమ్మ సిరి హనుమంత్.
(5 / 7)
"రావమ్మా మెరుపు తీగలాగా జబర్దస్త్‌కు హోస్ట్‌గా వచ్చావు.. సడెన్‌గా అందరిని సర్‌ప్రైజ్ చేశావు. అది ఎవరికీ చెప్పలేదు. మరి సడెన్‌గా మానేసావ్ ఏంటీ, ఏమైనా రీజన్ ఉందా. తీసేసారా లేకపోతే.." అని యాంకర్ శివ అడిగాడు.
(YouTube/Jabardasth/ETV Win OTT)(6 / 7)
"తీసేశారు.. నేను మానేయలేదు.. కావాలని ఎందుకు మానేస్తాం. తీసేశారు" అని సిరి హనుమంత్ చెప్పింది. "ఎందుకు కారణం ఏమైనా ఉందా" అని యాంకర్ శివ ప్రశ్నించాడు. "నాకేం ఐడియా లేదు" అని సిరి చెప్పింది. "బాగా చేస్తున్నావ్ కదా" అని శివ అంటే.. "ఏమో.. తెలియదు నాకు" అని సిరి తెలిపింది.
(7 / 7)
"మరి అడిగావా" అని యాంకర్ శివ అన్నాడు. "అడిగాను.. అడిగానా.. అయ్యో.. చెప్పినప్పుడు ఏమైంది అని అడుగుతాం కదా కచ్చితంగా. అడిగినప్పుడు రెండు షోలను (జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్) కలుపుదామనుకున్నాం కానీ, మాకు వర్కౌట్ కావట్లేదు కొన్ని థింగ్స్. అందుకే ఒక్క షోనే పెడుతున్నాం అన్న పాయింట్‌లో చెప్పారు. ఒకే అన్నాను. ఇంకా ఏం చేస్తాను. మనది అయినప్పుడు ఎప్పటికైనా మనకే వస్తుంది కదా" అని యాంకర్ సిరి హనుమంత్ చెప్పింది.
(YouTube/Jabardasth/ETV Win OTT)ఇతర గ్యాలరీలు