తెలుగు న్యూస్ / ఫోటో /
Bigg Boss Winner: 14 ఏళ్ల తర్వాత తెలుగులో బిగ్‌బాస్ విన్నర్ మూవీ - జానర్ అడగొద్దు మాక్కూడా తెలియదంటూ క్యాప్షన్!
Bigg Boss Winner:బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తెలుగు విన్నర్ బిందు మాధవి 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు.
(1 / 5)
బిందుమాధవి ప్రధాన పాత్రలో డార్క్ చాక్లెట్ పేరుతో తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో 35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తోన్నాడు.
(2 / 5)
దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత తెలుగులో బిందుమాధవి నటిస్తోన్న సినిమా ఇది. చివరగా 2011లో నాని హీరోగా నటించిన పిల్ల జమీందార్ సినిమాలో బిందుమాధవి నటించింది.
(3 / 5)
డార్క్ చాక్లెట్ సినిమాకు హీరో రానా దగ్గుబాటి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నాడు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(4 / 5)
జానర్ అడగొద్దు మాక్కూడా తెలియదు అంటూ డార్క్ చాక్లెట్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
ఇతర గ్యాలరీలు