
(1 / 11)
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వారిలో ఇప్పటికీ నలుగురు ఎలిమినేట్ అయ్యారు.

(2 / 11)
బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం మిడ్ వీక్‌లో రాయల్ కార్డ్ ఎంట్రీగా దివ్వ నిఖితా ఎంట్రీ ఇచ్చింది. దాంతో హౌజ్‌లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం కూడా మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

(3 / 11)
అయితే, మరికొంతమందిని కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించనున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.0 పేరుతో కొత్తగా ఏడుగురు కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు.

(4 / 11)
వారిలో తెలుగు నటుడు శ్రీనివాస సాయి ఒకరు. గోల్కొండ హైస్కూల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస సాయి ఆ తర్వాత శుభలేఖలు, వినరా సోదర వీర కుమారా సినిమాలు చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 లోకి అడుగుపెట్టనున్నాడు.

(5 / 11)
మరొకరు నిఖిల్ నాయర్. గృహలక్ష్మీ సీరియల్‌లో తులసి చిన్న కొడుకు ప్రేమ్‌గా నటించి ఆకట్టుకున్నాడు నిఖిల్ నాయర్. 'పలుకే బంగారమాయెనా' సీరియల్‌లో హీరోగా చేశాడు. అనంతరం 'దిల్ సే' ఓటీటీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ నాయర్ ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

(6 / 11)
బిగ్ బాస్ తెలుగు 9లోకి రాయల్ కార్డ్‌గా అడుగుపెడుతున్న మరొకరు గౌరవ్ గుప్తా. గీత ఎల్ఎల్‌బీ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న గౌరవ్ తన ఫిజికల్ ఫిట్‌నెస్‌తో అలరించనున్నాడు.

(7 / 11)
బిగ్ బాస్ 9 తెలుగులో గ్లామర్ పంచేందుకు అడుగుపెడుతున్న బ్యూటీ ఆయేషా జీనత్. కేరళకు చెందిన ఆయేషా సావిత్రిగారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్‌తో మెప్పించింది. 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో తన ఎనర్జీతో అలరించిన ఆయేషా తమిళ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా చేసింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్‌లోకి అడుగుపెడుతుంది.

(8 / 11)
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన దివ్వెల మాధురి సైతం బిగ్ బాస్ తెలుగు 9లోకి అడుగుపెడుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ఏపీలో తెగ వైరల్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభంలోనే వెళ్లాల్సిన దివ్వెల మాధురి ఇప్పుడు రాయల్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది.

(9 / 11)
తెలుగు రాష్ట్రాల్లో వివాదస్పదమైన అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష కూడా బిగ్ బాస్ తెలుగు 9లో ఎంట్రీ ఇస్తోంది. ముగ్గురు అక్కా చెల్లెళ్లో ఒకరైన రమ్య మోక్ష సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. గ్లామర్ షో, అందంతో అట్రాక్ట్ చేసిన రమ్య మోక్ష బిగ్ బాస్ 9 తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.

(10 / 11)
వీరితోపాటు మరో రాయల్ కార్డ్ ఎంట్రీగా హీరో తనీష్ రానున్నాడని సమాచారం. ఇదివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్‌గా చేసిన ఈ మాజీ సీజన్ 9లో అడుగుపెడతాడాని తాజా సమాచారం.

(11 / 11)
అయితే, బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.0 షూటింగ్ ఇవాళ (అక్టోబర్ 11), రేపు (అక్టోబర్ 12) జరగనుంది. ఇవాళ 8 గంటల సమయానికే షూటింగ్ ప్రారంభించారు. కానీ, ఈ పూర్తి ఎపిసోడ్‌ను అక్టోబర్ 12న సాయంత్రం ప్రసారం చేస్తారు.
ఇతర గ్యాలరీలు