(1 / 8)
తెలంగాణలో వ్యవసాయ భూముల నిర్వహణకు భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మండలాల్లో ఈసేవలు ప్రారంభమయ్యాయి. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
(2 / 8)
కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. వీటి ఆధారంగా సులభంగా భూ వివరాలను పొందవచ్చు.
(3 / 8)
సులభంగా వ్యవసాయాదారులు, రైతులకు సేవలు అందేలా భూ భారతి పోర్టల్ ను రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ పోర్టల్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
(4 / 8)
భూభారతి పోర్టల్‌లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. ఏఐ సహకారంతో ఈ పోర్టల్‌లో 'భూమిత్ర' అనే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ ఆప్షన్ ద్వారా… భూ భారతిలో యూజర్లు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా ఈ చాట్ బాట్ పని చేస్తుందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
(5 / 8)
రైతులు ప్రాథమికంగా ఇచ్చే వివరాలతో సరైన సమాచారం ఇవ్వడానికి ఈ భూ మిత్ర ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. హెల్ప్ డెస్క్ కింద ఈ చాట్‌బాట్(భూ మిత్ర)ను వినియోగించనున్నారు.
(6 / 8)
భూమిత్ర ఆప్షన్ పై క్లిక్ చేసి యూజర్ ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ పోర్టల్ లో డిస్ ప్లే అవుతుండగా… ఇంకా సేవలు ప్రారంభం కాలేదు. త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
(7 / 8)
త్వరలోనే భూమిత్ర ఆప్షన్ అందుబాటులోకి రానుండగా… మరోవైపు భూ భారతి పోర్టల్ సమస్యలు, విచారణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పోర్టల్ లో తలెత్తే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా 9140 - 29313999 నెంబర్ ను ప్రారంభించింది.
(8 / 8)
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య భూ భారతి టోల్ ఫ్రీ నెంబర్ సేవలను పొందవచ్చు. మరోవైపు భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా రెవెన్యూ సదస్సులను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… భూముల నిర్వహణలో కీలక సంస్కరణలు అమల్లోకి రానున్నాయి.
ఇతర గ్యాలరీలు