తెలుగు న్యూస్ / ఫోటో /
Bhagyashri Borse: టాలీవుడ్‌లో మరో బంపరాఫర్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే - సూర్యతో రొమాన్స్
Bhagyashri Borse: టాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సే మరో బంపర్ ఆఫర్ అందుకున్నది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో రొమాన్స్ చేయబోతున్నది. పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
(1 / 5)
కోలీవుడ్ అగ్ర హీరో సూర్య ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
(2 / 5)
ఈ తెలుగు మూవీలో సూర్యకు జోడీగా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ భాగ్యశ్రీ బోర్సే దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(3 / 5)
సూర్య హీరోగా నటిస్తోన్న సెకండ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇది. గతంలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర 2లో సూర్య హీరోగా నటించాడు.
(4 / 5)
రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా భాగ్యశ్రీకి మాత్రం ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.
ఇతర గ్యాలరీలు