BGMI Ban:బ్యాటిల్‌గ్రౌండ్స్ గేమర్లకు బ్యాడ్ న్యూస్..ఇండియాలో BGMI గేమ్ బ్యాన్!
బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India - BGMI)ను ఇండియాలో నిషేధించారు. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన BGMIకు చైనాకు చెందిన PUBG కంపెనీ సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే PUBGని ఇండియాలో నిషేధించగా తాజాగా BGMIకు బ్యాన్ చేశారు.
బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India - BGMI)ను ఇండియాలో నిషేధించారు. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన BGMIకు చైనాకు చెందిన PUBG కంపెనీ సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే PUBGని ఇండియాలో నిషేధించగా తాజాగా BGMIకు బ్యాన్ చేశారు.
(1 / 7)
భారత్‌లో BGMI నిషేధించినట్లు పలు మీడియా సంస్థలునివేదించాయి. ఎటువంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండానే Google Play Store, App Store నుండి Battlegrounds Mobile India యాప్ తొలగించారు. ఇది BGMI ప్లేయర్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.
(BGMI)(2 / 7)
PUBG మొబైల్ ఇండియా, గారెనా ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌ల వల్ల దేశ భద్రత ముప్పు వాటిల్లుతుందని నిఘా వర్గాలు హెచ్చరిక కారణంగా ఇటీవల ఈ గెమ్‌లను నిషేధించారు. చైనా మూలాలు ఉన్న సంస్థల ద్వారా దేశ భద్రతపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నారు.
(BGMI)(3 / 7)
Google Play Store, App Store నుండి ఈ యాప్‌ను తీసివేయడం గురించి BGMI మాతృ సంస్థ Kraftonని సంప్రదించగా.. Google Play నుండి BGMI ఎలా తీసివేయడం వాస్తవమేనని. పూర్తి సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని Krafton చెప్పినట్లు" MySmartPrice పేర్కొంది.
(BGMI)(4 / 7)
BGMI ప్లేస్టోర్ నుండి తొలిగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంస్థ ప్లేస్టోర్ నుండి యాప్ తొలగించినట్లు TechCrunch మనీష్ సింగ్ ట్వీటర్ ద్వారా తెలిపారు.
(BGMI)(5 / 7)
2020లో PUBG మొబైల్ నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే కాన్సెప్ట్‌తో BGMI 2021లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ యాప్‌ను కూడా నిషేదించారు. దీనిపై క్రాఫ్టన్ అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి BGMI తొలగింపు వెనుక అధికారిక కారణం ఇప్పటికీ స్పష్టంగా లేదు.
(PUBG Mobile )(6 / 7)
ఇక నుండి Google Play Store లేదా App Store నుండి BGMI యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేరు. అయితే, మీరు ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఎలాంటి అటంకం లేకుండా గేమ్‌ను ఆడవచ్చు.
(Twitter/New State Mobile)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు