తెలుగు న్యూస్ / ఫోటో /
Winter Healthy Drinks: చలికాలంలో ఉదయం ఈ డ్రింక్స్ తాగండి.. వ్యాధులు, ఇన్‍ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది!
- Winter Healthy Drinks: చలికాలంలో వ్యాధుల బారి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చల్లటి వాతారణం కారణంగా ఇన్ఫెక్షన్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, కొన్ని రకాల డ్రింక్స్ తాగితే వీటి రిస్క్ తగ్గుతుంది.
- Winter Healthy Drinks: చలికాలంలో వ్యాధుల బారి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చల్లటి వాతారణం కారణంగా ఇన్ఫెక్షన్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, కొన్ని రకాల డ్రింక్స్ తాగితే వీటి రిస్క్ తగ్గుతుంది.
(1 / 6)
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, వీటి నుంచి రక్షణ కలుగుతుంది. వ్యాధుల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. అలాంటి ఐదు హెల్దీ డ్రింక్స్ ఇవే..
(2 / 6)
ధనియాల టీ: ధనియాలతో చేసే ఈ టీలో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇన్‍ఫెక్షన్ల బారి నుంచి ఇది కాపాడగలదు. వేడి నీటిలో ధనియాలను కాసేపు నానబెట్టి.. వడగొట్టుకొని ఈ టీ తాగొచ్చు.
(3 / 6)
అల్లం, నిమ్మకాయ టీ: ఈ టీ తాగితే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్లాసు నీటిలో ఇంచు అల్లం వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాన్ని వడగొట్టి నిమ్మరసం పిండుకొని తాగేయవచ్చు.
(4 / 6)
దానిమ్మ టీ: ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసంతో ఈ టీని తయారు చేసుకోవచ్చు. టీ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ టీ తాగితే రోగ నిరోధక శక్తి చాలా మెరుగవుతుంది. చలికాలంలో రోగాల నుంచి రక్షణ కల్పించగలదు.
(5 / 6)
నిమ్మ తేనే టీ: నిమ్మరసం, తేనెతో చేసే ఈ టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. గొంతు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగాలి.
ఇతర గ్యాలరీలు