Best smartwatch deals of 2022: ఈ ఏడాది పాపులర్ స్మార్ట్‌వాచ్‍లపై బెస్ట్ డీల్స్ ఇవే..
Best smartwatch deals of 2022: స్మార్ట్‌వాచ్.. ప్రస్తుతం కాలంలో ముఖ్యమైన గాడ్జెట్‍గా మారింది. ఫిట్‍నెస్‍పై దృష్టి పెట్టేవారు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. హెల్త్ ట్రాక్ చేసుకునేందుకు, మినీ స్మార్ట్ ఫోన్‍గానూ ఈ వాచ్‍లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాలా స్మార్ట్‌వాచ్‍లతో హార్ట్ రేట్‍ను, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవచ్చు. దీంతో కొవిడ్-19 ప్రపంచంలోకి వచ్చాక.. ఈ స్మార్ట్ వాచ్‍లకు మరింత డిమాండ్ పెరిగింది. కాగా, 2022లో కొన్ని స్మార్ట్ వాచ్‍లపై మంచి డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియమ్ నుంచి బడ్జెట్ రేంజ్ వరకు కొన్ని బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. వాటిలో కొన్నే ఇవి. గతంలోనే లాంచ్ అయినా.. ఈ ఏడాది బెస్ట్ డీల్స్‌తో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్ 7, సామ్‍సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రోతో పాటు మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి. పూర్తి వివరాలు చూడండి.
(1 / 6)
Apple Watch Series 7: యాపిల్ వాచ్ సిరీస్ 8 తాజాగా లాంచ్ అయినా, దీని కంటే ముందు జనరేషన్ వాచ్ సిరీస్ 7.. ఈ ఏడాది మంచి డీల్స్‌తో లభిస్తున్నాయి. ఎందుకంటే ప్రీమియమ్ ఫీచర్లను కలిగి ఉన్న వాచ్ 7.. రీజనబుల్ ధరల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
(Amritanshu / HT Tech)(2 / 6)
జీపీఎస్ + సెల్యూలార్ 41mm యాపిల్ వాచ్ సిరీస్ 7 ప్రస్తుతం రూ.39,994 ధరకు లభిస్తోంది. దీని సాధారణ ధర రూ.50,900 కాగా, ప్రస్తుతం డిస్కౌంట్‍తో అందుబాటులో ఉంది. ఐపీ6ఎక్స్ డస్ట్, డబ్ల్యూఆర్50 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.
(Amritanshu / HT Tech)(3 / 6)
Samsung Galaxy Watch 5 Pro: సామ్‍సంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్‍లోని ఈ ప్రో మోడల్ రౌండ్ డయల్, మ్యాగ్నటిక్ బకెల్ స్ట్రాప్‍ను కలిగి ఉంది. 1.4 ఇంచుల రౌండ్ సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో వస్తోంది. గూగుల్ వేర్ ఓఎస్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ పే, మెసేజెస్, కీప్ నోట్స్ తో పాటు మరిన్ని సర్వీసులు ఈ గెలాక్సీ వాచ్ 5 ప్రోలో ఉంటాయి. ప్రస్తుతం ఈ వాచ్ ధర రూ.44,999గా ఉంది.
(Amritanshu / HT Tech)(4 / 6)
Garmin Forerunner 55: హెల్త్, ఫిట్‍నెస్ వివరాలను నిరంతరం ట్రాక్ చేసుకోవాలనుకునే వారికి గ్రామిన్ ఫోర్‌రన్నర్ 55.. జీపీఎస్ స్మార్ట్ వాచ్ సరిగ్గా సూటవుతుంది. దీని సాధారణ ధర రూ.22,490 కాగా.. ప్రస్తుతం డిస్కౌంట్‍తో రూ.20,990కు లభిస్తోంది.
(Garmin)(5 / 6)
Noise Colorfit Pro 4: బడ్జెట్ రేంజ్‍లో హెల్త్, ఫిట్‍నెస్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్న వారికి నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మంచి ఆప్షన్‍గా ఉంది. ప్రస్తుతం ఈ వాచ్ రూ.3,499కు లభిస్తోంది. అమెజాన్‍తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్స్, 150 క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ కాలింగ్ సహా మరిన్ని ఫీచర్లతో ఈ వాచ్ ఆకర్షణీయంగా ఉంది.
(Noise)(6 / 6)
Boat Xtend Smartwatch: తక్కువ ధరలో మంచి ఫీచర్లను ఈ బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. అమెజాన్, బోట్ అధికారిక వెబ్‍సైట్‍తో పాటు రిటైల్ స్టోర్లలోనూ రూ.2,999లోపు ధరకే ఈ వాచ్‍ను కొనుగోలు చేయవచ్చు. 1,69 ఇంచుల డిస్‍ప్లే, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీవో2, స్లీప్ ట్రాకింగ్‍తో పాటు మరిన్ని హెల్త్ ఫీచర్లను ఇది కలిగి ఉంది.
(boAt)ఇతర గ్యాలరీలు