రూ. 30వేల ధరలోపు బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ వస్తుంటే.. ఇక ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకు?
బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో రూ. 30వేల బడ్జెట్లోపు బెస్ట్ సెల్లింగ్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ని ఇక్కడ చూసేయండి..
(1 / 6)
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లలో సెల్ఫీ కెమెరాలు తప్పనిసరిగా మారిపోయాయి.మంచి సెల్ఫీలు తీసుకోవడానికి మంచి కెమెరా ఉన్న ఫోన్ కోసం ప్రజలు చూస్తున్నారు.మంచి సెల్ఫీ కెమెరాలు ఉన్న చాలా స్మార్ట్ ఫోన్ లను రూ.30,000 లోపే కొనుగోలు చేయవచ్చు.
(2 / 6)
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ: మోటరోలా డివైస్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక ప్యానెల్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
(3 / 6)
రెడ్మీ నోట్ 14 ప్రో: ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌ని రూ.24,999కు కొనుగోలు చేయవచ్చు.
(4 / 6)
వివో టి3 అల్ట్రా: 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతో కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని ధర రూ.28,999.
(5 / 6)
రియల్మీ 13 ప్రో ప్లస్: స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ+8 ఎంపీ+50 ఎంపీ మెయిన్ కెమెరా సెటప్ ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు