Budget Phone: బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇవి బెస్ట్!
Budget Phone: ప్రతీ సెగ్మెంట్‍లో చాలా స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్‍లోనూ చాలా మొబైళ్లు లభిస్తున్నాయి. అందుకే ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన టాస్క్. అయితే బడ్జెట్ ధరలో మంచి పర్ఫార్మెన్స్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండే ఫోన్ కావాలనుకుంటున్నారా.. అయితే బెస్ట్ ఆప్షన్లు ఇవే.
(1 / 5)
Realme C55: రియల్‍మీ సీ55 ఫోన్.. మీడియాటెక్ డైమన్సిటీ జీ88 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 5000mAH బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999గా ఉంది.(Priya / HT Tech)
(2 / 5)
POCO M5: 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.58 ఇంచుల డిస్‍ప్లేను పోకో ఎం5 కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంటుంది. వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999గా ఉంది.(HT Tech)
(3 / 5)
Moto G32: స్నాప్‍డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో మోటో జీ32 ఫోన్ వస్తోంది. 90Hz 6.5 ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ ప్రారంభ ధర ఫ్లిప్‍కార్ట్ లో రూ.10,499గా ఉంది.(Motorola)
(4 / 5)
Samsung Galaxy F13: 6000ఎంఏహెచ్ బ్యాటరీని సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్13 కలిగి ఉంది. ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ ఉంటుంది. వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.10,999గా ఉంది.(Flipkart )
ఇతర గ్యాలరీలు