Hiccups tips: నీళ్లు తాగినా ఎక్కిళ్లు ఆగట్లేదా? ఇలా చేయండి చాలు
Hiccups tips: ఎక్కిళ్ళు మామూలే. కొందరికి అప్పుడప్పుడు వస్తుంటాయి. కొందరికి తరచూ వస్తుంటాయి. కొద్దిగా నీరు తాగితే ఆగిపోతాయి. అలా ఆగకపోతే వాటిని ఆపడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
(1 / 7)
ఎక్కిళ్ళు ఎప్పుడైనా రావచ్చు. కొద్దిగా నీరు తాగిన వెంటనే ఆగిపోవచ్చు. కొన్నిసార్లు మాత్రం ఎక్కిళ్ళు దానంతట అదే ఆగిపోవు. కొన్ని సెకన్ల నుంచి నిమిషాల దాకా ఎక్కిళ్లు రావచ్చు. అతిగా తినడం కూడా దీనికొక కారణమే.
(2 / 7)
ఎక్కువ మసాలా ఆహారాలు తినడం, ఆల్కహాల్, సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలు తాగడం, చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉన్న ఆహారాలు తినడం ఎక్కిళ్ళకు కారణమవుతాయి.
(3 / 7)
నీరు తాగిన తర్వాత కూడా ఎక్కిళ్లు తగ్గకపోతే కాసేపు శ్వాస బిగబట్టుకోడానికి ప్రయత్నించండి. 10 నుంచి 20 సెకన్ల పాటూ శ్వాస తీసుకోకుండా ఆగి మళ్లీ తీసుకోండి. ఇలా కాసేపు చేస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
(4 / 7)
ఎక్కిళ్లు ఆపడానికి మరో మార్గం ఒక గ్లాసు నీళ్లు తాగడం. అయితే మామూలుగా కాకుండా ముక్కును మూసుకుని నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.
(5 / 7)
ఎంత ప్రయత్నించినా ఎక్కిళ్ళు ఆగకపోతే... నిమ్మకాయను కోసి దాని వాసన చూడాలి.ఎక్కిళ్ళు కాసేపటి తర్వాత ఆగిపోతాయి. లేదంటే చెంచాడు పంచదారను నోట్లో వేసుకున్నా వెంటనే ఎక్కిళ్లు ఆగుతాయి.
(6 / 7)
లేదంటే ఒక గ్లాసు చల్లటి నీటిలో పంచదారను కరిగించి సిరప్ గా చేసి తాగవచ్చు.ఇవన్నీ ప్రయత్నించినా ఎక్కిళ్లు ఆగవు.అంటే వరుసగా రెండు రోజుల పాటు ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్ ను సంప్రదించండి.
ఇతర గ్యాలరీలు