OTT Thrillers: ఓటీటీలో బెస్ట్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- అన్నీ ఒక్కదాంట్లోనే స్ట్రీమింగ్, 4 తెలుగులో- అదిరిపోయే ట్విస్టులు!
Best 7 OTT Thriller Movies To Watch: ఓటీటీలో గ్రిప్పింగ్ నెరేషన్‌తో థ్రిల్‌కి గురి చేసే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అలా కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 7 ఓటీటీ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(1 / 8)
మీరు రొమాంటిక్ చిత్రాలను చూడటం వలన విసుగు చెందితే, మీరు సస్పెన్స్, థ్రిల్లర్‌లతో నిండిన చిత్రాలను చూడవచ్చు. లేదా, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఒకటి రెండు కాదు, ఏకంగా చూడాల్సిన బెస్ట్ 7 ఓటీటీ సినిమాలను ఇక్కడ తెలుసుకోండి.
(2 / 8)
నీనా గుప్తా నటించిన క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ '1000 బేబీస్'. ఇది మిమ్మల్ని చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. ఇందులో చాలా చెడు గతం ఉన్న వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో కూడా 1000 బేబీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 8)
విద్యుత్ జమ్వాల్, అనుపమ్ ఖేర్ నటించిన హిస్టరీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'IB 71'. ఈ సినిమాను కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో చూడొచ్చు.
(4 / 8)
ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునేవారు ఈ పార్కింగ్ మూవీని ట్రై చేయొచ్చు. 2023లో విడుదలైన ఈ తమిళ భాషా థ్రిల్లర్ మూవీని Disney+ Hotstar ఓటీటీలో తెలుగులో వీక్షించవచ్చు.
(5 / 8)
2017లో విడుదలైన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'కాబిల్'. ఈ సినిమా కథ రోహన్ అనే అంధ డబ్బింగ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. రోహన్ భార్య సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అందుకు గల కారణాలు, ఏంటీ, రోహన్ భార్యకు ఏమైంది, ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందనే రివేంజ్ బ్యాక్ డ్రాప్‌తో కాబిల్ మూవీ తెరకెక్కింది. తెలుగులో బలం టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీలో వీక్షించవచ్చు.
(6 / 8)
'కాపీ' మూవీ అనేది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది చూస్తున్నప్పుడు మీ మనసును కదిలిస్తుంది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినిమా అతి తక్కువ రన్‌టైమ్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
(7 / 8)
2022లో విడుదలైన కట్‌పుట్లి మూవీ క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిందీలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు